స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌లుగా నిలవడంతో, ఇప్పుడు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని ప్రేక్షకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.
ఈ పాన్ ఇండియా మూవీకి బన్నీ కూడా కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా బడ్జెట్‌లో భారీ కోత ఉండనుండగా, బన్నీ కూడా తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకోనున్నాడు.
కాగా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా షేర్‌ను బన్నీకి ఇవ్వనున్నట్లు చిత్ర వర్గాల టాక్.
ఏదేమైనా ఇలా హీరోలు లాక్‌డౌన్ కారణంగా తమ రెమ్యునరేషన్‌ను తగ్గించినట్లే తగ్గించి, సినిమా షేర్‌లు తీసుకోవడం ఎంతవరకు సబబు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంలో పుష్ప చిత్రం ఒక్కటే కాకుండా మిగతా సినిమాలు కూడా ఈ ధోరణిని పాటిస్తుండటం నిజంగా నిర్మాతలకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.ఇక పుష్ప సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తోన్న సంగతి తెలిసిందే.