టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలతోనే కాకుండా ఈ మధ్య వివాదాలతో కూడా తరచూ వార్తలలో నిలుస్తున్నాడు అయితే సుత్తి లేకుండా సూటిగా మాట్లాడటం రామ్ గోపాల్ వర్మ యొక్క స్పెషాలిటీ.ఈ స్పెషాలిటీ కారణంగానే తాజాగా మరోమారు సోషల్ మీడియా మాధ్యమాలలో రామ్ గోపాల్ వర్మ తెగ వైరల్ అవుతున్నాడు.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే తాజాగా ఓ ప్రముఖ మీడియా వెబ్ సైట్ సంస్థ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన అభిమాన నటి స్వర్గీయ శ్రీదేవి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తనకు స్వర్గీయ నటి శ్రీదేవి అంటే చాలా అభిమానమని అంతేగాక ఆమె థైస్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగక ఆమె థైస్ వల్లనే ఆమెకు వీరాభిమానిగా మారానని చెప్పుకొచ్చాడు.
దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.అంతేగాక హీరోయిన్ల ప్రైవేట్ శరీర భాగాలను చూసి వారికి అభిమానులుగా మారడం ఏంటి రామ్ గోపాల్ వర్మ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ మర్డర్ అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత కథ ఆధారంగా పవర్ స్టార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడడంతో రామ్ గోపాల్ వర్మ తన చిత్రాలను ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తూ కొత్త ట్రెండ్ ని సృష్టిస్తున్నాడు.