ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకు మరియు అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గి పోయింది.ఇంతకు ముందు అయితే ఒక హీరో లేదా హీరోయిన్ ని కలవాలంటే ఎక్కువ సమయం పట్టేది కానీ ఇప్పుడంతా మారిపోయింది.
కాగా ఒకప్పుడు టాలీవుడ్ సినీ పరిశ్రమకి జీరో సైజ్ నడుము అంటే ఏంటో పరిచయం చేసినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తాజాగా ఇలియానా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది.
దీంతో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ప్రస్తుతం మీరు బాయ్ ఫ్రెండ్ లేకుండా ఖాళీగా ఉన్నారా.? అంటూ ప్రశ్నించాడు.దీంతో ఇలియానా స్పందిస్తూ తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా మాధ్యమాలలో పంచుకోవడానికి ఇష్టపడనని రిప్లై ఇచ్చింది.అంతేగాక తాను కూడా ఇతరుల లవ్ ఎఫైర్ల గురించి తెలుసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని కూడా తెలిపింది.
దీంతో కొందరు నెటిజనులు ఈ విషయాన్ని బాగానే ట్రోల్స్ చేస్తున్నారు.మరికొంత మంది నెటిజన్లు అయితే సెలబ్రిటీలకు కూడా తమ వ్యక్తిగత జీవితం ఉంటుందని కాబట్టి వారిని ఇలా బహిరంగంగా వ్యక్తిగత విషయాలను అడిగి ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో ఈ అమ్మడికి తెలుగులో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.
అయితే బాలీవుడ్లో మాత్రం ఇటీవల స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్న టువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది.అయితే ఈ మధ్య సినిమా అవకాశాలు లేక బాగా బరువు పెరిగిన ఇలియానా మళ్ళీ తన జీరో సైజ్ నడుము కోసం ప్రస్తుతం బాగానే కసరత్తు చేస్తోంది.