కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకి ఔషధ చక్ర పేరు పెట్టారు.ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ మందుని ఈ నెల 7 నుండి ప్రజలకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.
అయితే ఈ ఔషధానికి ఔషధ చక్ర పేరుతో పంపిణీ చేస్తారని తెలుస్తుంది.ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఔషధ చక్ర మందు పంపిణీ జరుగనుంది.
ముందు ఆ ప్రాంతానికి చెందిన వారికి ఈ మందు అందిస్తారని తెలుతుంది.ఆ తర్వాత ఇతర ప్రాంతాల వారికి మందు సప్లై చేస్తారని చెబుతున్నారు.
ఇక ఇతర ప్రాంతాల వారు ఈ మందు పొందేందుకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని ఇంతకుముందే వెల్లడించారు.
ముందు కరోనా రాకుండా ఇచ్చే మందు అందుబాటు చేస్తారట.
ఆ తర్వత కరోనా పాజిటివ్ వారికి ఇచ్చే ఔషధాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఈ ఔషధ తయారీ జరుగుతుంది.
ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఈ ఔషధ తయారీ జరుగుతుందని తెలుస్తుంది.ఔషధ చక్రగా ఆనందయ్య మందుని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.
అయితే ఆనందయ్య కంటి మందుపై ప్రభుత్వం నుండి నివేదిక రాలేదు.అందుకే ఆ మందుని ప్రస్తుతానికి ఆపేసినట్టు తెలుస్తుంది.
ఆ మందుకి మరో నాలుగైదు వారాల తర్వాత నివేదిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.