గొల్లలగుంట సర్పంచి అభ్యర్థిగా పోటీకి దిగిన సబ్బెళ్ళ పుష్పవతి భర్త శ్రీనివాస్ రెడ్డి ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ షెడ్యూల్ ని ప్రకటించిన తర్వాత ఆయన వైసీపీ నుండి టిడిపి లోకి చేరాడు.
ఈ నేపథ్యంలో ఇక్కడి సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి భార్యను నామినేషన్ వెయ్యాలిసిందిగా కోరారు.
వైసీపీ నాయకులు ఈ విషయంలో నామినేషన్ ను విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు.
ఆయన ఎవరి మాట వినకుండా నామినేషన్ వేశారు.గత నెల 31 న వీరు నామినేషన్ వేశారు.
ఈ నేపథ్యంలో మధ్యానం మూడు గంటల సమయంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు ఇచ్చి తీసుకెళ్లి హత్య చేశారు.ఈ విషయంపై ఆయన భార్య పోలీసు స్టేషన్ లో అనుమానం ఉన్న ముగ్గురుపై కేసు పెట్టింది.
ఈ విషయంపై నారా లోకేష్ నేడు గొల్లలగుంట చేరుకొని శ్రీనివాస్ రెడ్డి కుటుంబాని పరామర్శించాడు.

ఈ సందర్భంగా ఆయన జగన్ పై విమర్శలు చేశాడు రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని రాజ రెడ్డి రాజ్యాంగం అమలు అవ్వుతుందని అన్నాడు.ఇప్పటివరకు 13 మంది టిడిపి కార్యకర్తలను వైసీపీ పొట్టన పెట్టుకుందని అన్నాడు.శ్రీనివాస్ రెడ్డి హత్యకు కారణం అయిన ఆ ముగ్గురుని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశాడు.
ఏపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని నారా లోకేష్ మండి పడ్డాడు.నేడు పట్టాభి పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్ వైసీపీ కండువ కప్పుకున్నాడని ఆరోపించాడు
.