శరీరంలో వ్యర్థాలు, మలినాలు, విష పదార్థాలు ఉంటే అవయవాలన్నీ తీవ్రంగా దెబ్బ తింటాయి.అందుకే శరీరాన్ని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేస్తూ ఉండాలి.
లేదంటే అనేక అనారోగ్య సమస్యలతో ఆరోగ్యకరమైన జీవితం అంధకారంగా మారిపోతుంది.అయితే శరీరంలో వ్యర్థాలను తొలిగించుకునేందుకు కొందరు మార్కెట్‌లో లభ్యమయ్యే డిటాక్స్ డ్రింక్స్ తీసుకుంటారు.
కానీ, ఇంట్లోనే ఉండే కొన్ని కొన్ని ఆహారాలతోనూ వ్యర్థాలను బయటకు నెట్టేయచ్చు.మరి ఆలస్యం ఏ మాత్రం చేయకుండా ఆ ఫుట్స్ ఏంటో తెలసుకోండి.
శరీరంలోకి వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పంపడంతో కీర దోస అద్భుతంగా సహాయపడుతుంది.ఫ్రెష్‌గా ఉన్న కీర దోస నుంచి రసం తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేవించాలి.ఇలా చేస్తే మీ శరీరం సహజంగానే శుద్ధి అవుతుంది.
అలాగే ఆరెంజ్ పండు కూడా ఈ సమస్యను పరిష్కరించగలదు.రెగ్యులర్‌గా డైట్‌లో ఆరెంజ్‌ను చేర్చుకుంటే బోలెడన్ని పోషకాలు అందడంతో పాటుగా శరీరంలోని వ్యర్థాలు, మలినాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి.
పండు మిర్చి కూడా శరీరంలో విషాన్ని విరిచేసి వ్యర్థాలకు తొలిగించగలదు.
కాబట్టి, మీరు తినే ఆహారంలో పండు మిర్చి ఉండేలా చూసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
క్యారెట్ జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్ తరచూ తీసుకోవాలి.ఎందుకంటే.క్యారెట్, బీటూరూట్‌ల్లో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు శరీరంలోని విషపదార్ధాలను సమర్థవంతంగా బయటకు పంపించి.
మీ అంతర్గత శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయి.
ఇక ఇవే కాకుండా గ్రీన్ టీ, అల్లం, వెల్లుల్లి, టమాటా, పసుపు, పొద్దు తిరుగుడు విత్తనాలు, పుదీనా టీ, దానిమ్మ, యాపిల్, అరటి పండు, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బచ్చలి కూర వంటి ఆహారాలు సైతం శరీరం నుండి విష పూరితమైన వ్యర్ధాలను, మలినాలను బయటకు నెట్టేసి ఆరోగ్యాన్ని పెంపొందించగలవు.