ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంకు, ఎస్‌ఈసి కి మధ్య కొన్నిరోజుల గా యుద్దం జరుగుతుంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలును ఎట్టి పరిస్థితులోను నిర్వహించాలని ప్రకటించడంతో అధికార పార్టీ మంత్రులు, ఎంఎల్‌ఏ లనుండు విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు సరైన సమయం కాదని వాదిస్తున్నారు.కానీ ఈ విషయంలో నిమ్మగడ్డ మొండి పట్టుకొని కూర్చున్నాడు.
తాజాగా ఈ విషయంపై టిడిపి నేత గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మేజారిటీ సీట్స్ గెలుస్తాం అనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు.ముందస్తు ఎన్నికలకు ఎందుకు భయపడుతుందని ప్రశ్నించాడు.

ఎన్నికల నిర్వాహణ అనేది రాష్ట్ర ప్రభుత్వంకు, ఎస్‌ఈసి కి మధ్య జరుగుతుంది.మరి మధ్యలో ఎందుకు టిడిపి పార్టీని తీసుకువస్తున్నారో నాకు అర్థం కావడంలేదని అన్నాడు.కరోనా సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషిన్ ఎన్నికలు పోస్ట్ పోన్ చేసినప్పుడు ఎందుకని అప్పుడు ఎలక్షన్ కమిషినర్ పై గొడవకు దిగారని ప్రశ్నించాడు.రాజ్యాంగం సంక్షోభం దిశగా ప్రభుత్వం వెళ్ళుతుందని బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డాడు.
రాజ్యాంగ విధానాల ద్వారా పరిపాలన సాగాలని అన్నాడు.రాజ్యాంగం వ్యతిరేకంగా పనిచేయడం ఏ ప్రభుత్వంకు మంచిది కాదు అన్నాడు.