తల్లి ఎదుటే ప్రాణాలొదిలిన కొడుకు...!

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని ఓ తల్లి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరైంది.హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ఏ ఒక్క డాక్టర్ వచ్చి చూడలేదని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

 Corona, Nalgonda, Mother, Death-TeluguStop.com

ఈ సంఘలనను చూసి ఆస్పత్రిలో ఉన్న రోగులు, సహాయకులు కంటతడి పెట్టుకున్నాడు.

కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలాడు.

‘‘ అమ్మా ఊపిరి ఆడటం లేదు’’ అంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొడుకును చూసి ఆ తల్లి గుండె పగిలేలా రోధించడం చూసి పక్కనున్న వారు కంటతడి పెట్టారు.కరోనా కష్టకాలంలో మరో బాధితుడు ఆక్సిజన్ అందక మరణించాడు.

ఈ విషాద ఘటన నల్లొండ జిల్లాలో చోటు చేసుకుంది.

నల్లొండ జిల్లా మాడుగులపల్లి మండలం సల్కునూర్ కు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది.

దీంతో అతడిని నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.వైద్యులు అతడిని ఐసోలేషన్ వార్డులో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

అప్పటికే ఆ యువకుడి ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు వైద్యం అందించడానికి ముందుకు రాలేదని పలువురు తెలిపారు.

ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం ఆ తల్లి పాలిట శాపంగా మారింది.

అతడికి ఆక్సిజన్ అందక తల్లి ముందే తల్లడిల్లి మరణించాడు.అది చూసిన ఆ తల్లి గుండె పగిలేలా అరవడం మొదలుపెట్టింది.

వైద్యులకు సంప్రదించినా పట్టించుకోకపోవడంతో కొడుకును చూసి తల్లడిల్లిపోయింది.ఆ యువకుడు చనిపోవడంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా నిశబ్ద ఛాయలు అలుముకున్నాయి.

కొడుకు మరణించడంతో వైద్య సిబ్బందిపై మండిపడింది.డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని ఆరోపించింది.

చికిత్స కోసం చేరినప్పటి నుంచి ఏ వైద్యుడు వైద్యం చేయలేదని, ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షించాలని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube