తల్లి ఎదుటే ప్రాణాలొదిలిన కొడుకు…!

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని ఓ తల్లి ఆస్పత్రిలో కన్నీరుమున్నీరైంది.

హాస్పిటల్ లో చేరినప్పటి నుంచి ఏ ఒక్క డాక్టర్ వచ్చి చూడలేదని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సంఘలనను చూసి ఆస్పత్రిలో ఉన్న రోగులు, సహాయకులు కంటతడి పెట్టుకున్నాడు.కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు వదిలాడు.

‘‘ అమ్మా ఊపిరి ఆడటం లేదు’’ అంటూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొడుకును చూసి ఆ తల్లి గుండె పగిలేలా రోధించడం చూసి పక్కనున్న వారు కంటతడి పెట్టారు.

కరోనా కష్టకాలంలో మరో బాధితుడు ఆక్సిజన్ అందక మరణించాడు.ఈ విషాద ఘటన నల్లొండ జిల్లాలో చోటు చేసుకుంది.

నల్లొండ జిల్లా మాడుగులపల్లి మండలం సల్కునూర్ కు చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది.

దీంతో అతడిని నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.వైద్యులు అతడిని ఐసోలేషన్ వార్డులో చేర్పించి వైద్యం అందిస్తున్నారు.

అప్పటికే ఆ యువకుడి ఆరోగ్యం విషమించడంతో డాక్టర్లు వైద్యం అందించడానికి ముందుకు రాలేదని పలువురు తెలిపారు.

ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడం ఆ తల్లి పాలిట శాపంగా మారింది.అతడికి ఆక్సిజన్ అందక తల్లి ముందే తల్లడిల్లి మరణించాడు.

అది చూసిన ఆ తల్లి గుండె పగిలేలా అరవడం మొదలుపెట్టింది.వైద్యులకు సంప్రదించినా పట్టించుకోకపోవడంతో కొడుకును చూసి తల్లడిల్లిపోయింది.

ఆ యువకుడు చనిపోవడంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా నిశబ్ద ఛాయలు అలుముకున్నాయి.కొడుకు మరణించడంతో వైద్య సిబ్బందిపై మండిపడింది.

డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు ప్రాణాలు పోయాయని ఆరోపించింది.చికిత్స కోసం చేరినప్పటి నుంచి ఏ వైద్యుడు వైద్యం చేయలేదని, ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షించాలని మండిపడ్డారు.

జైలులో పశ్చాతాపపడుతున్న దర్శన్.. రేణుకాస్వామి ఫ్యామిలీకి అలా సాయం చేయనున్నారా?