తులసి మొక్కను గురువారం రోజు ఇలా పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ దూరం అయిపోతాయా..

సనాతన ధర్మం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవునికి అంకితం చేయబడి ఉంది.అదేవిధంగా గురువారం రోజు విష్ణువును పూజించడానికి ఎంతో మంచి రోజు.

 If Tulsi Plant Is Worshiped Like This On Thursday, Will All Financial Problems G-TeluguStop.com

ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే అన్ని కష్టాలు దూరమైపోతాయని భక్తుల విశ్వాసం.అంతేకాకుండా గురువారం రోజు విష్ణువుతో పాటు తులసి మొక్కను కూడా చాలామంది భక్తులు పూజిస్తూ ఉంటారు.

తులసి విష్ణుకు ఎంతో ఇష్టమైనది. విష్ణు పూజలో తులసిని కూడా తప్పకుండా పూజ చేస్తూ ఉంటారు.

అలాగే ప్రతి ఇంట్లో తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.తులసి పూజించడం వలన విష్ణువు ప్రసన్నమవుతుందా అని భక్తుల నమ్మకం.

విష్ణువును తులసినీ పూజించే ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి, ఆనందానికి లోటు ఉండదని చాలామంది ప్రజల నమ్మకం.గురువారం ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి తులసికి పచ్చిపాలతో నైవైద్యం సమర్పించాలి.దీనివల్ల విష్ణు ఎంతో సంతోషిస్తాడు.అదేవిధంగా సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం మంచిది.ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పుడూ లభిస్తుందని చెబుతున్నారు.తులసిని లక్ష్మీదేవి రూపంగా చాలామంది ప్రజలు భావిస్తారు.

అందువలన తులసి పూజ ఇంట్లో ఆనందం, శాంతి, ప్రశాంతత శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు.చాలామంది గురువారం రోజు ఉపవాసం కూడా ఉంటారు.

అంతే కాకుండా మీరు గురువారం ఉపవాసం ఉన్నట్లయితే ఆ రోజు తులసిని పూజించేటప్పుడు పూజ సమయంలో పసుపు బట్టలను ధరించడం ఎంతో మంచిది.తులసిని భక్తితో పూజిస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.తులసి మొక్కను ఇంటికి తీసుకురావడానికి గురువారం కూడా ఎంతో శుభం అని చెబుతున్నారు.దీనితో పాటు గురువారం రోజు అరటి మొక్కలకు నీరు పోస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా దూరం అవుతాయని భక్తులు నమ్ముతున్నారు.

అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ధనాధాన్యాల సమస్య ఎప్పటికీ ఉండదని కూడా నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube