సాధారణంగా చాలామంది ఇంటిలో రిఫ్రిజిరేటర్( Refrigerator ) పైన రకరకాల వస్తువులను ఉంచుతూ ఉంటారు.ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటిలోనూ రిఫ్రిజిరేటర్లు కచ్చితంగా ఉన్నాయి.
ఇక రిఫ్రిజిరేటర్ ను దానికి ఉపయోగించాల్సిన అవసరాలకు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్ పైన ఇష్టానురాజ్యాంగ చాలా రకాల వస్తువులను పెడుతూ ఉంటారు.అలా ఫ్రిజ్ పై ఇష్టాను రాజ్యాంగ వస్తువులను పెడితే వాస్తు దోషాలు( Vastu Doshas ) తలెత్తుతాయని పండితులు చెబుతున్నారు.
సహజంగా కిచెన్ లో ఫ్రిజ్ పెట్టిన చోట కూడా వాస్తు నియమాలను అనుసరించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిజ్ పైన పెట్టకూడని వస్తువులు పెడితే ధన నష్టం కచ్చితంగా జరుగుతుంది.అందుకే రిఫ్రిజిరేటర్ పైన పెట్టకూడని వస్తువులు ఏమిటి.రిఫ్రిజిరేటర్ కి ఉన్న వాస్తు నియమాల( Rules of Vastu ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో రిఫ్రిజిరేటర్ పెట్టుకోవడానికి కూడా వాస్తు నియమాలు కచ్చితంగా ఉంటాయి.రిఫ్రిజిరేటర్ ను ఎల్లప్పుడూ గోడకు కనీసం ఒక అడుగు దూరంలో పశ్చిమ దిశలో లేదా నైరుతి దిశలో అమర్చుకోవాలి.
ఇంట్లో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి ఈ దిశలో రిఫ్రిజిరేటర్ ను పెట్టాలని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.చాలామంది రిఫ్రిజిరేటర్ పైన డబ్బు, బంగారం( Money , gold ) వంటి వాటిని పెడుతూ ఉంటారు.

ఎవరైనా డబ్బులు ఇస్తే తొందరపాటు లో రిఫ్రిజిరేటర్ మీద పెట్టేస్తారు.ఇలా చేస్తే భవిష్యత్తులో వారు డబ్బు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.రిఫ్రిజిరేటర్ పైన డబ్బులు, బంగారం వంటి వాటిని పెడితే వ్యాపారంలో కూడా నష్టం జరిగే అవకాశం ఉంది.ఇక చాలామంది తమ పిల్లలకు వచ్చినటువంటి బహుమతులను, పథకాలను రిఫ్రిజిరేటర్ పైన పెడుతూ ఉంటారు.
కానీ అలా చేయడం ఏమాత్రం మంచిది కాదు.ఒకవేళ అలా చేస్తే దాని ప్రభావం కూడా తమ కుటుంబం పై తప్పకుండా ఉంటుంది.
చాలామంది ఫ్రిజ్ పై నిత్యం వారు వేసుకోవాల్సిన ఔషధలను పెట్టుకుంటూ ఉంటారు.అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని ఈ పండితులు చెబుతున్నారు.
కాబట్టి రిఫ్రిజిరేటర్ పై ఇలాంటి వస్తువులను ఉంచకపోవడమే మంచిది.