జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,భూగర్భ, గనుల మరియు కృష్ణ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.
సామినేని ఉదయభాను గారు.ఈసందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచన చేసే నాయకుడు దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని,ఇంతమంది కార్యకర్తలు కార్యక్రమం మొదటి నుంచి పూర్తి అయ్యేవరకు ఉండడం అంటే కార్యకర్తలు నాయకుని పట్ల ఎంత అభిమానంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు అని, రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఎన్నో రకాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలు కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కృషి చేస్తుంటే పచ్చ బృందం మాత్రం కేవలం మనల్ని ఆపడానికి మన నాయకుని విమర్శలు చేయడానికి మాత్రమే పనిచేస్తుంది అని, మనం చేసే యుద్ధం టీడీపీ మాత్రమే కాదని అనేక చీకటి మిత్రులు మనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు అని, ప్రత్యేక హోదా అంశమే అందుకు నిదర్శనం అని, కేంద్ర హోంశాఖ మ్యానిఫెస్టోలో పెట్టిన అజెండా రాత్రికి రాత్రే మాయం అయిందని కానీ మీరు ఎటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదని, మన ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకునేలా చూస్తారు అని తప్పకుండా ఎన్ని శక్తులు ఒకటైన ప్రత్యేక హోదా నుంచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని నిధులు వస్తాయని, రాష్ట్రం మరింత అభివృద్ధి దిశలో ముందు ఉంటుంది అని, నియోజకవర్గం పట్ల నిబద్దత ఉన్న నాయకులు భాను గారు అని ఆయన నేతృత్వంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గారికి కృతజ్ఞతలు అని, నియోజకవర్గ పరిధిలో జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి గ్రామంలో గత టీడీపీ హయాంలో 1కోటి 25 లక్షల రూపాయల ను ఖర్చు చేసి అరకొర గా పనులు చేసి కమీషన్లు తీసుకుని చేతులు దులుపుకొన్నారు అని ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో అదే భవనాన్ని కేవలం 35 లక్షల వ్యయంతో సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించామని అలాగే పట్టణంలో ప్రభుత్వ హస్పిటల్ లో స్థానిక రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ వారి CSR నిధులు నుంచి 45 లక్షల ను మంజూరు చేయించి ఆక్సిజన్ ఫ్లాంట్ ఏర్పాటు చేసామని, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారి CSR నిధులు ద్వారా 1కోటి 25 లక్షల వ్యయంతో టౌన్ హాల్ నిర్మించి పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చామని, ఎక్కడ ఎటువంటి అవినీతికి తావులేకుండా అభివృద్ధి మాత్రమే ఎజెండా గా పనిచేస్తున్నామని,ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా జగన్ అన్న ఇళ్ళు శరవేగంగా పూర్తి అవుతున్నాయి అని, పేదల సొతింటి కలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నామని,నియోజకవర్గ స్థాయిలో రోడ్లు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, నియోజకవర్గ అభివృద్ధి కి గౌరవ మంత్రి గారు తగిన తోడ్పాటు అందివ్వాలని కోరారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్ గారు, మొండితొక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ మొండితొక అరుణ్ కుమార్ గారు,జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ యువనాయకులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు,ZP చెర్మెన్ ఉప్పల హారిక రాము,KDCC బ్యాంక్ చేర్మెన్ తన్నీరు నాగేశ్వరరావు,మున్సిపల్ చెర్మెన్ రంగాపురం రాఘవేంద్ర,తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మరియు వివిధ శాఖల అధికారులు,పాల్గొన్నారు.