చాతుర్మాస సమయం దగ్గరకు రానే వచ్చింది.చాతుర్మాసం( Chaturmasam ) ఆషాడ మాసంలోని దేవా శయన ఏకాదశి రోజు మొదలై కార్తీక మాసంలోని ఉత్థాన ఏకాదశి రోజు ముగుస్తుంది.4 నెలల పాటు సాగే ఈ మాసాన్ని ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.చాతుర్మాస కాలంలో విష్ణువు ( Srimaha Vishnu ) నిద్రలోకి జరుపుకుంటారు.
అలాగే నాలుగు నెలల పాటు నిద్రలోనే ఉంటారని చెబుతారు.ఈ మాసం జూన్ 29వ తేదీన మొదలై, నవంబర్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది.
శ్రావణ, భాద్రపద,అశ్వయుజ, కార్తీక మాసాలు చాతుర్మాస కాలాన్ని కలిగి ఉంటాయి.
అయితే చాతుర్మాస కాలంలో చాతుర్మాస వ్రతాన్ని( Chaturmas Vrat ) ఆచరిస్తే శుభాలు కలుగుతాయని ఆ విష్ణు దేవుడి కృప కటాక్షాలు ఉంటాయని భక్తులు బలంగా నమ్ముతారు.
ఈ చాతుర్మాస వ్రతం ఏ విధంగా చేస్తారో.ఈ మాసం విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాతుర్మాస వ్రతన్ని అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు ఎలాంటి లింగ వివక్ష లేకుండా ఆచరించవచ్చు.బ్రహ్మచారులు, గృహస్తులు, సన్యాసులు, ప్రతి ఒక్కరు చాతుర్మాస వ్రతన్ని ఆచరించవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే చాతుర్మాస వ్రతం ఆరోగ్యానికి సంబంధించింది.చతుర్మాస వ్రతం పాటించేవారు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.మీరు ఈ నాలుగు మాసాలలో కొన్ని ఆహార పదార్థాలను తినకుండా ఉండాలి.శ్రావణమాసంలో ఆకుకూరలు,, భాద్రపద మాసంలో పెరుగు, అశ్వయుజ మాసంలో పాలు, కార్తీక మాసంలో పప్పు లాంటి పదార్థాలను మీరు తినకూడదు.
ఈ నాలుగు మాసాలు మీరు నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటాకూడదు.
ఈ మాసాలలో సూర్యోదయం కాకముందే స్నానం చేసి అత్యంత నిష్టతో ఇష్టదేవతలను పూజించి దీక్ష చేయాలి.అలాగే భగవద్గీతలోని కొన్ని అధ్యాయానాలను కంఠస్థం చేయాలి.యోగ సాధన చేయాలి.
వ్రత కాలంలో ఎవరైనా సరే బ్రహ్మచార్య దీక్షను ఆచరించాలి.అలాగే ఒంటి పూట భోజనం మాత్రమే చేయాలి.
నేలపై మాత్రమే నిద్రపోవాలి.అహింసను ఆచరించాలి.
ఈ నాలుగు మాసాలు దానధర్మాలు వంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి.
LATEST NEWS - TELUGU