ఇంట గెలవకపోయినా బయట గెలుస్తున్న నాని.. యూఎస్ లో పరుగులు పెట్టిస్తున్నాడుగా..

నేచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 Nani Ante Sundaraniki Box Office Collections In Usa Details, Usa, Ante Sundarani-TeluguStop.com

ఈ సినిమా నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా ఇచ్చిన విజయం తర్వాత నాని ‘అంటే సుందరానికి’ సినిమా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి చేసాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇందులో నాని కి జోడీగా నజ్రియా ఫహద్ నటించింది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు.ఈ సినిమాలో నాని డిఫెరెంట్ పాత్రలో నటించాడు.

ముందు నుండే ఈ సినిమా ప్రొమోషన్స్ బాగా చేస్తూ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేశారు.ఇక ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అయ్యింది.

తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ వచ్చినప్పటికీ అదే స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు.ఫస్ట్ డే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికి 3.7 కోట్లు మాత్రమే తెచ్చింది.అయితే యూఎస్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

ముందు నుండి పాజిటివ్ బజ్ ఏర్పడడం వల్ల యుఎస్ లో ఈ సినిమా మంచి స్టార్టింగ్ తో స్టార్ట్ అయ్యింది.

యుఎస్ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా ప్రీమియర్స్ తోనే 2 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది.ఇక నిన్ననే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసి వీకెండ్ అవ్వకుండానే 6 లక్షల డాలర్లకు పైగా రాబట్టి మంచి స్పీడ్ తో దూసుకు పోతుంది.

చూస్తుంటే ఈ సినిమా 1 మిలియన్ కూడా ఈజీగా క్రాస్ చేస్తుంది అని అనిపిస్తుంది.ఇలా నాని ఇంట గెలవక పోయినా బయట అయితే గెలుస్తున్నాడు.చూడాలి మరి ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సాధిస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube