బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ( Kiara Advani ) సిద్ధార్థ్ మల్హోత్రా ( Sidharth Malhotra ) కూడా ఉన్నారు.కియారా – సిద్ధార్థ్ ప్రేమించి రాజస్థాన్ లో పెద్దల సమక్షంలో ఫిబ్రవరి 7న గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు.ఇక ప్రెజెంట్ ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉంటూనే వారి మ్యారీడ్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతుంది.కియారా ప్రెగ్నెంట్ అంటూ ఈమె త్వరలోనే తల్లి కాబోతుంది అని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.
దీనికి కారణం ఈమె బేబీ బంప్ తో కనిపించడమే.కియారా తన సినిమా ప్రమోషన్స్ కోసం జైపూర్ వెళ్ళింది.

అక్కడ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫోటోలు దిగగా వాటిలో కియారా కొద్దిపాటి బేబీ బంప్ తో కనిపించడం ఇప్పుడు షాక్ కు గురి చేస్తుంది.దీంతో ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ నా లేదంటే డ్రెస్ కారణంగా ఇలా కనిపిస్తుందా అనేది అర్ధం కావడం లేదు.ఏది ఏమైనా ఈమె నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఆమె చేస్తున్న సినిమాలకు అడ్డంకి కావడం ఖాయం.

మరీ ముఖ్యంగా ఈ భామ ప్రెగ్నెంట్ అయితే ప్రస్తుతం మన టాలీవుడ్ లో చేస్తున్న రామ్ చరణ్ ( Ram charan )గేమ్ ఛేంజర్’కు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూట్ పూర్తి కాలేదు.మరి ఇది నిజమైతే ఈమె కోసం సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
చూడాలి ఈ విషయంలో నిజమెంతో.







