హెచ్ 1 బీ వీసా.. దరఖాస్తులు సరిపడా వచ్చాయి: యూఎస్‌సీఐఎస్ కీలక ప్రకటన

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1బీ వీసాకు( H1B visa ) సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన విడుదల చేసింది.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు నిర్ణీత పరిమితికి (క్యాప్) చేరుకున్నాయని తెలిపింది.

 H1b 2024 Cap Reached Says Us Immigration Services , Us Immigration Services, H1b-TeluguStop.com

ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసినట్లు వెల్లడించింది.సోమవారం విడుదల చేసిన ప్రకటనను అనుసరించి హెచ్1 బీ క్యాప్‌కు తగినన్ని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లను పొందినట్లు తెలిపింది.

ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.యూఎస్ కాంగ్రెస్( US Congress ) హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.

ఇందులో 6800 వీసాలు యూఎస్ – చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.

కాగా.నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.

వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Telugu Amazon, Hb Cap Reached, Hb Visa, Mathematics, Meta, Salesce, Congress, Si

ఇకపోతే.కోవిడ్‌తో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.తాజాగా ఆర్ధిక మాంద్యపు నీలినీడలు ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి.దిగ్గజ సంస్థలైన మెటా, ట్విట్టర్‌,అమెజాన్, సేల్స్‌ఫోర్స్‌లలో అప్పుడే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది.దీంతో కార్పోరేట్ రంగం.ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ పరిణామాలు అమెరికాలో హెచ్ 1 బీ వీసాతో పనిచేస్తున్న భారతీయులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి.అమెరికన్ టెక్ సెక్టార్‌లో భారీ తొలగింపుల మధ్య అధిక సంఖ్యలో భారతీయ నిపుణులు నిరుద్యోగులుగా మారుతున్నారు.2022-23లో దాదాపు 3 లక్షల మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు.ఈ పరిణామాలు హెచ్ 1 బీ వీసాపై అమెరికాలో వున్న వారిని వణికిస్తున్నాయి.ఈ కేటగిరీ కింద వున్న వారు ఉద్యోగం కోల్పోతే.60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని పొందాలి.లేనిపక్షంలో వారు అమెరికాను వదిలి వెళ్లాల్సి వుంటుంది.

Telugu Amazon, Hb Cap Reached, Hb Visa, Mathematics, Meta, Salesce, Congress, Si

ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయిన వారు, ఉద్యోగం చేస్తున్న వారు ఈ నిబంధనకే భయపడుతున్నారు.కుటుంబంతో సహా అమెరికాలోనే స్థిరపడాలని భావిస్తున్న వారికి ఈ రూల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్ కమిటీ శుభవార్త చెప్పింది.

వీసా గడువు (గ్రేస్ పీరియడ్)ను 60 రోజుల నుంచి 180 రోజులకు పొడిగించాల్సిందిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ( Department of Homeland Security ), యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)కు ఈ కమిటీ సిఫారసు చేసింది.దీనికి ప్రభుత్వ ఆమోదం లభిస్తే విదేశీ వృత్తి నిపుణులు ముఖ్యంగా భారతీయులకు ఊరట లభించినట్లే.

ఇది అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయినప్పటికీ 180 రోజుల్లో మరో కొత్త కొలువును సంపాదించుకునేందుకు వీలు కలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube