రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన హీరో,బిల్లు చూసి షాక్ అయ్యాడు

ఒకప్పుడు ఎలాంటి విషయం అయినా బయటపడడానికి కొంత సమయం పట్టేది.కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియా ప్రభావమా అని ప్రతి విషయం వెంటనే బయటకు వచ్చేస్తుంది.

అది సెలబ్రిటీల విషయం అయినా సరే విషయం బయటపడాల్సిందే.తాజాగా బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ ఒక విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

 Rahul Bose Orderedtwo Bananas At A 5 Starhotel-రెండు అరటి పండ్లు ఆర్డర్ ఇచ్చిన హీరో,బిల్లు చూసి షాక్ అయ్యాడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజంగా ఆ విషయం వింటే మాత్రం మీరు తప్పకుండా ఆశ్చర్యపోసి ముక్కున వేలు కూడా వేసుకుంటారు.ఇంతకీ ఏంటా విషయం అని అనుకుంటున్నారా.

హీరో గారు షూటింగ్ కోసం అని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో దిగారట.ఈ క్రమంలో రెండు అరటి పండ్లు ఆర్డర్ చేశారు.

అయితే అరటి పండ్లు పక్కన పెడితే ఆ పండ్ల కు వారు వేసిన ధర ను చూసి సార్ గారు నిర్ఘాంతపోయారట.

ఇంతకీ రెండు అరటి పండ్ల ధర ఏంతో తెలుసా కేవలం రూ.442.50 మాత్రమే నట.ఏంటి రేటు చూసి ఆర్చర్యపోతున్నారా, రెండు పండ్లు కాదు గెల ధర అన్నట్లు అనిపిస్తుందా.మరి అందుకే ఫీల్ అయిన హీరో గారు వెంటనే ఈ విషయాన్నీ సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు.సెంట్రల్ జీఎస్టీ రూ.33.75,యూటీ జీ ఎస్టీ మరో రూ.33.75 వేసి మొత్తం అంతా కలిపి రూ.442.50 అయ్యింది.పండ్లు ఆరోగ్యానికి హానికరం కాదని ఎవరు చెప్పారు అంటూ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.

కమలహాసన్ నటించిన ‘విశ్వరూపం’, ‘విశ్వరూపం-2’ సినిమాల్లో రాహుల్ బోస్ ప్రతి నాయకుడిగా నటించాడు.పలు బాలీవుడ్, ఆర్ట్ సినిమాల్లో హీరోగా నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ బోస్ చండీగఢ్ లో ఒక షూటింగ్ నిమిత్తం వెళ్ళాడు.

ఈ క్రమంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో దిగి అరటి పండ్లు ఆర్డర్ చేయగా పండ్ల తో పాటు ఈ బిల్లు చూసి పాపం రాహుల్ ఆశ్చర్యపోయాడు.ఐతే ఈ విషయాన్ని సోషల్ మీడియా లో షేర్ చేయడం తో నెటిజన్లు కూడా తమదైన శైలి లో స్పందిస్తున్నారు.ఆ ధరతో ఏకంగా అరటి పండ్ల గెల కొనేయచ్చని కొందరు అంటుంటే,ఇంకొందరు బయట మార్కెట్లో ఆ జీఎస్టీ ధరలకు డజను అరటి పండ్లు దొరుకుతాయని కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు అయితే బహుశా భూమి మీద పండే ఆఖరి అరటి పండ్లు అవే కావచ్చు, జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ తెగ జోకులు పేలుస్తున్నారు.

మొత్తానికి రెండు అరటి పండ్ల ధర అంత విలువ ఉంటే మరి అక్కడి భోజనం ధర ఎంత ఉంటుందో మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు