లక్కీ గోపీచంద్.. నిజంగా పక్కా కమర్షియల్‌ అయితే లాభాల పంట ఖాయం

యాక్షన్ హీరో గోపీచంద్‌ హీరోగా రాశి ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వం లో బన్నీ వాసు నిర్మించిన పక్కా కమర్షియల్‌ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈమద్య కాలంలో సినిమా లు పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీ కారణంగా వసూళ్లు ఎక్కువగా రావడం లేదు.

 Gopichand Pakka Commercial Movie Coming Soon , Gopichand , Maruthi , Movie News , Pakka Comercial , Rashi Kanna-TeluguStop.com

కాని పక్కా కమర్షియల్‌ సినిమా కు ఆ ఇబ్బంది లేదు.ఎందుకంటే ఈ సినిమా వచ్చే రోజున రాబోతున్న సినిమా లు ఈ సినిమా కు కనీసం పోటీ కూడా కాదు.

పైగా మంచి సోలో రిలీజ్ దక్కినట్లు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియా లో పక్కా కమర్షియల్‌ సినిమా కు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.

మారుతి సినిమా అంటే యూత్‌ లో మంచి క్రేజ్ ఉంటుంది.అందుకే ఈ సినిమా కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేస్తుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పక్కా కమర్షియల్‌ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయడంతో పాటు పాత టికెట్ల రేట్లకు ఈ సినిమా ను విడుదల చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు.తద్వారా ఈ సినిమా మినిమంగా సక్సెస్ దక్కించుకున్నా.

నిజంగా కమర్షియల్‌ మూవీ అన్నట్లుగా ఉన్నా కూడా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్‌ సాధిస్తుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా సినిమా కు మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది.

అందుకే ఈ సినిమా ఖచ్చితంగా పక్కా కమర్షియల్‌ సినిమా అన్నట్లుగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.గోపీచంద్‌ కు ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు.

గోపీచంద్‌ తో పాటు ఈ సినిమా సక్సెస్ రాశి ఖన్నాకు సక్సెస్‌ కావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube