'స్కంద' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఎప్పుడంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో రామ్ పోతినేని( Ram Pothineni ) ఒకరు.

లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న రామ్ ఇప్పుడు మాత్రం మాస్ హీరోగా మారిపోయాడు.

మాస్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ యాక్షన్ సినిమాలను వరుసగా లైన్లో పెట్టుకుంటూ పోతున్నాడు ఈ యంగ్ హీరో.ప్రజెంట్ రామ్ లైనప్ లో ఉన్న సినిమాల్లో అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో చేస్తున్న స్కంద( Skanda ) ఒకటి.

రామ్ హీరోగా మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే షూట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ థండర్ అంటూ రిలీజ్ చేసిన వీడియో అందరిని ఎంతగానో అలరించింది.ఆ తర్వాత ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి అంచనాలు డబల్ చేసారు.

భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ఉంటుంది అని చెప్పకనే చెప్పాడు.ఈ గ్లింప్స్ లో రామ్ డైలాగ్స్ తో పాటు లుక్ కూడా అదిరిపోయింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్( Skanda First Single ) ను రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అని టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఫ్యామిలీ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్కంద నుండి ఫస్ట్ సాంగ్ ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజాగా బజ్ వినిపిస్తుంది.ఇక ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో ఇప్పటి నుండే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఈ సినిమాపై హైప్ పెంచాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తుంది.

చూడాలి ఈ సినిమా అయినా రామ్ కు హిట్ ఇస్తుందో లేదో.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు