చైనా స్కూల్ పుస్తకాలలో భారతీయుడి గురించి పాఠం.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

కొంతమంది సక్సెస్ స్టోరీలు వినడానికి అశ్చర్యంగా ఉండటంతో పాటు మనం గర్వించేలా ఉంటాయి.ఒక భారతీయుడి( Indian ) కథను చైనా స్కూల్ పుస్తకాలలో చేర్చడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

 Dev Raturi Success Story Details Here Goes Viral In Social Media , Dev Rathoodi,-TeluguStop.com

ఉత్తరాఖాండ్ లోని చిన్న గ్రామంలో జన్మించిన దేవ్ రతూడీ( Dev Rathoodi ) గురించి చైనీస్ సిలబస్ లో పాఠంగా చేర్చడం గమనార్హం.చైనాలో మోస్ట్ పాపులర్ నటులలో ఒకరిగా ఎదగడంతో దేవ్ రతూడీకి ఈ ఘనత సొంతమైంది.

ఒకప్పుడు పొట్టకూటి కోసం వెయిటర్ గా పని చేసిన దేవ్ రతూఢీ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.ఈ రీజన్ వల్లే ఆయన సక్సెస్ స్టోరీని పుస్తకంలో పాఠంగా చేర్చడం జరిగింది.

ఉత్తరాఖాండ్ లోని కెమ్రియా సౌర్ అనే ప్రాంతంలో జన్మించిన ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి బ్రూస్ లీని ఎంతో అభిమానించేవారు.బ్రూస్ లీపై ఉన్న అభిమానంతో దేవ్ రతూఢీ కరాటే ఛాంపియన్ గా మారాలని అనుకున్నాడు.

Telugu China School, Delhi, Dev Rathoodi, Dev Raturi, Indian, Kemria Sauer, Utta

అయితే కుటుంబ పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఎదురవడంతో ఢిల్లీలో( Delhi ) చిన్నాచితకా పనులు చేసి 2005లో చైనాలోని ఒక రెస్టారెంట్ లో వెయిటర్ గా చేరాడు.నెలకు 10,000 జీతంతో అక్కడ చేరిన దేవ్ రతూడీ తర్వాత రోజుల్లో హోటల్ మేనేజర్ స్థాయికి ఎదిగి సొంతంగా రెస్టారెంట్ ను మొదలుపెట్టారు.2017లో ఒక చైనా డైరెక్టర్ టీవీ సిరీస్ లో నటించే ఛాన్స్ ఇవ్వగా దేవ్ రతూడీ నటించారు.ఆ సిరీస్ హిట్ కావడంతో దేవ్ కు వరుసగా ఆఫర్లు వచ్చాయి.

Telugu China School, Delhi, Dev Rathoodi, Dev Raturi, Indian, Kemria Sauer, Utta

చైనా సినీ రంగంలోని పాపులర్ స్టార్స్ లో దేవ్ ఒకరు.తనకు వచ్చిన పాపులారిటీ వల్ల దేవ్ రెస్టారెంట్ బిజినెస్ లో మరింత సక్సెస్ అయ్యారు.సొంతంగా ఎనిమిది రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు.తన సొంత గ్రామం నుంచి 150 మందిని తీసుకెళ్లి దేవ్ తన కంపెనీలో వాళ్లకు ఉద్యోగాలను ఇచ్చారు.దేవ్ స్పూర్తిదాయక ప్రయాణం గురించి అందరికీ తెలియాలని ఏడో తరగతి ఇంగ్లీష్ బుక్ లో దేవ్ పై ఒక పాఠ్యాంశాన్ని తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube