నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.ఈయన కెరీర్ లోనే ప్రెజెంట్ దూసుకు పోతున్నాడు.
అఖండ ముందు వరకు వరుసగా ప్లాప్స్ అందుకుని బాలయ్య రేసులో వెనుక బడ్డారు.అయితే ఎప్పుడైతే అఖండ హిట్ అయ్యిందో అప్పటి నుండి ఈయన సక్సెస్ స్టార్ట్ అయ్యింది.
బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.
ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.వరుసగా హిట్స్ అందుకుంటూ వస్తున్నా అనిల్ రావిపూడి బాలయ్యతో ఎలాంటి ఎమోషనల్ కథను తెరకెక్కించ బోతున్నాడో అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక వెంటనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని మేకర్స్ భావించారు.‘NBK108‘ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 23 నుండి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు.కానీ అనుకోకుండా నందమూరి తారకరత్న మరణించడంతో ఈ సినిమా షూట్ డిలే అయ్యింది.

ఈ షెడ్యూల్ కొద్దీ రోజుల పాటు వాయిదా వేయగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ షెడ్యూల్ కోసం డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ మార్చి 12 నుండి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.అనిల్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా షూట్ కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తుంది.
అలాగే ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.







