కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.
కాగా మూడు రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలలో మొత్తం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ఖరారు చేస్తారు.
అదేవిధంగా ఇవాళ జరిగే కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించే అంశంపై కూడా చర్చించనుంది.







