గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే చుట్టూ మ‌రో వివాదం.. ఆ విష‌యంలో నోటీసులు..

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వివాదంలో చిక్కుకున్నారు.అక్రమ మైనింగ్ కు ఆయన సహకారం అందించారనే పిటిషన్లో హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది.

 Another Controversy Surrounding Gannavaram Mla Notices In That Regard.., Gannav-TeluguStop.com

గన్నవరం నియోజకవర్గం పరిధిలో గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలపై దాఖలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో భాగంగా ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనుల శాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.అలాగే వ్యాపారులైన‌ అన్నె లక్ష్మణరావు ఓలుపల్లి మోహన రంగారావు కె.శేషుకుమార్ బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయ ఈవో, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.వీరందరినీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

వ్యాపారులు, అధికారుల‌కు కూడా.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీ బ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసర ప్రాంతాల్లో గనుల అక్రమ తవ్వకాలు, చిన్న తరహా ఖనిజాలను వెలికితీయడాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాల మేరకు వ్యాపారులు అన్నె లక్ష్మణరావు, ఓలుపల్లి మోహన రంగారావు, కె.శేషుకుమార్‌ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని గన్నవరానికి చెందిన మాజీ సైనికుడు ముప్పనేని రవికుమార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Telugu Gannavarammla, Seshukumar, Krishna, Olupallimohana-Political

వారి నుంచి జరిమానా, సీనరేజి రుసుం వసూలు చేయాలని కోరారు.అంతేకాకుండా గతంలో బ్రహ్మలింగేశ్వరస్వామి దేవాలయం ఉన్న చోటే విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేసేలా ఆదేశించాలని ఆయన తన పిల్లో కోరారు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నోటీసులు జారీ చేసింది.అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నవారికి జరిమానా విధించాలని కోర్టును విన్నవించారు.మైనింగ్ కార్యకలాపాల నిమిత్తం చెరువు సమీపంలో సహజసిద్ధంగా పెరిగిన వేల చెట్లను నరికేశారని తెలిపారు.అందరి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ నిమిత్తం విచారణను ఎనిమిది వారాలు వాయిదా వేసింది.

మ‌రి చూడాలి ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కు వెళ్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube