మరో 48 గంటల్లో లైగర్ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.లైగర్ మూవీకి బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతుండటంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యకం చేస్తున్నారు.లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మీలను ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో సుమ ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పూరీ జగన్నాథ్ గారు భారీ ఈవెంట్లు చేయడంలో దిట్ట అని సుమ అన్నారు.
ఆంధ్రావాలా అప్పుడు గుర్తుందా ఏం చేశారో అంటూ సుమ ఆ సమయంలో జరిగిన ఘటనల గురించి చెప్పుకొచ్చారు. ఆంధ్రావాలా మూవీ ఈవెంట్ కోసం నాలుగు ట్రైన్లు వేశారని నన్ను ఒక ట్రైన్ కు ఇన్ ఛార్జ్ గా ఉంచారని ఆమె అన్నారు.
ట్రైన్ లో రీచ్ అయ్యాక నిమ్మకూరు వరకు ఊహించని స్థాయిలో జనం ఉన్నారని సుమ చెప్పుకొచ్చారు.ఆ క్రౌడ్ చూసి టాటా బై బై అని వెనక్కు వచ్చేశానని ఆమె కామెంట్ చేశారు.ఆరోజు హెలికాప్టర్ ల్యాండ్ అయిందా అని సుమ అడగగా అయిందని పూరీ జగన్నాథ్ తెలిపారు.ఎన్టీఆర్ ఫంక్షన్ కు వచ్చిన జనాన్ని చూసి మధ్యలో పారిపోయానని సుమ పరోక్షంగా చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా కథ గురించి మాట్లాడుతూ కరీంనగర్ కుర్రాడు హీరో అని హీరో అమ్మ కొడుకును నేషనల్ ఛాంపియన్ గా చూడాలని అనుకుంటుందని హీరో ఇంటర్నేషనల్ లెవెల్ కు కూడ వెళతాడని ఈ మధ్యలో హీరో లవ్ లో పడటం, మైక్ టైసన్ ఎలా వచ్చాడనేది కథ అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.