టీచర్ తన ప్రేమను అంగీకరించలేదని యువకుడు కత్తితో దారుణం..!

ప్రస్తుత కాలంలో ప్రేమిస్తే ఒక సమస్య.ప్రేమించకపోతే మరో సమస్య.

 Man Attacked Teacher With Knife In Rajasthan Details, Man, Attacked Teacher ,kni-TeluguStop.com

మొదట ప్రేమించమని వెంటపడడం, అవసరం తీరాక వదిలించుకోవడం ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారింది.ఇంకా ప్రేమించిన వారిని వదిలించుకోవడం కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు.

ప్రేమించి ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవాలా అని ప్రేమించడం మానేస్తే వెంటపడి వేధించడంతోపాటు దారుణాలకు పాల్పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు తనకంటే వయసులో రెండేళ్లు పెద్దగా ఉండే టీచర్ ను( Teacher ) గాఢంగా ప్రేమించాడు.

ప్రేమ విషయం టీచర్ కు చెప్పడంతో అంగీకరించలేదు.దీంతో ఆ టీచర్ పై కత్తితో దాడి చేశాడు.

అసలు కథ ఏమిటో చూద్దాం.

Telugu Ajmeer, Anil, Keerthy Soni, Knife, Rajasthan, Stabbed Teacher, Teacherkee

వివరాల్లోకెళితే.రాజస్థాన్ లోని( Rajasthan ) అజ్మీర్ లో ఉండే కీర్తీ సోని (32) స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.అదే ప్రాంతంలో ఉండే వివేక్ సింగ్ (30)( Vivek Singh ) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ టీచర్ వెంట పడేవాడు.

కానీ ఇతని ప్రేమను టీచర్ అంగీకరించలేదు.వివేక్ రోజు వెంటపడుతూ వేధిస్తూ ఉండడంతో ఆ టీచర్ తన స్నేహితుడైన అనిల్ కు విషయం చెప్పింది.

Telugu Ajmeer, Anil, Keerthy Soni, Knife, Rajasthan, Stabbed Teacher, Teacherkee

మొదట సర్ది చెబుదామని అనిల్, టీచర్ కలిసి వివేక్ ను ఓ కేఫ్ కు పిలిపించి ఎంత సర్ది చెప్పినా వివేక్ తన తీరు మార్చుకోలేదు.అప్పుడు టీచర్ కూడా నిన్ను నేను ప్రేమించడం లేదు అంటూ స్పష్టంగా చెప్పేసింది.దీంతో వివేక్ ఆగ్రహానికి లోనై తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సోనీ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.సోనీ రక్తపు మడుగులోకి జారి కుప్పకూలింది.వెంటనే అనిల్ ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా.చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

వివేక్ దాడి చేసిన అనంతరం పారిపోయాడు.పోలీసులు కేసు నమోదు చేసి వివేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube