భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు.గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.నియోజకవర్గంలోని ఓ ఇంట్లో కొందరు యువకులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు దాడులు చేశారు.
ఈ నేపథ్యంలో ముగ్గురు పట్టుబడగా మరో 17 మంది పరారైయ్యారు.పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అయితే స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గంజాయి పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మరోవైపు సోదాలు నిర్వహించడానికి వెళ్తున్న అబ్కారీ అధికారులు, పోలీసులపై మత్తుబాబులు దాడులకు పాల్పడుతున్నారు.