బ్రిటన్ ఎన్నికలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్.నిన్నటి ఇండియా – పాక్ మ్యాచ్ ఎలాంటి హై వోల్టేజ్ ను క్రియేట్ చేసిందో అంత కంటే ఎక్కువగా బ్రిటన్ ఎన్నికలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.
భారత్ ను ఏళ్ళ తరబడి పాలించి, మనపై పెత్తనం వెలగబెట్టి, ఎంతో విలువైన సంపదను దోచుకుపోయిన బ్రిటన్ ను మనమే పాలించే అవకాశం , ఆరోజు రానే వచ్చేసింది.మొన్న జరిగిన బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో ఈ అవకాశం త్రుటిలో తప్పిపోయింది.
రిషి సునక్ ముందంజ లో ఉన్నారని అందరూ భావిస్తున్న సమయంలో అన్యూహ్యంగా ట్రస్ అధికారం చేపట్టారు.అయితే తాజాగా ప్రధాని పదవి నుంచీ తప్పుకోవడంతో మళ్ళీ ఇప్పుడు రిషి సునక్ ప్రధాని అవుతారనే బలమైన చర్చ నడుస్తోంది.
ట్రస్ రాజీనామాతో మరోసారి ప్రధానిని ఎన్నికోవడం అనివార్యం అవడంతో తాను ప్రధాని రేసులో ఉంటానని రిషి సునక్ ప్రకటించాడు.కాగా రిషికి పోటీగా మాజీ ప్రధాని బోరిస్ కూడా బరిలో దిగారు.
అయితే ఈ పోరు హోరాహోరిగా ఉండబోతోందని అనుకుంటున్న సమయంలో రిషి సునక్ కు అనూహ్యంగా 100 మంది ఎంపీల మద్దతు ఉందని తేలింది.ఈ క్రమంలో విదేశాలలో ఉన్న జాన్సన్ తనకు మద్దతు కూడా గట్టేందుకు ఉన్న పళంగా బ్రిటన్ వచ్చేశారు.
కాగా తాజాగా రిషి సునక్ కు సుమారు 140 మంది ఎంపీల మద్దతు ఉన్నదని తేలడంతో జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రిషి కంటే తాను వెనుకబడి ఉన్నాను కాబట్టి ఈ పోటీల నుంచీ తాను వైదొలగడం మంచిదని తెలిపారు.దాంతో రిషి కి ప్రధాన పోటీ దారుగా ఉన్న బోరిస్ తప్పుకోవడంతో రిషి గెలుపు నల్లేరు మీద నడకలా మారింది.అంతేకాదు మరొక పోటీ దారు పెన్నీ కి ఎంపీల మద్దతు పెద్దగా లేకపోవడంతో బోరిస్ కు మద్దతు ఇచ్చే ఎంపీల మద్దతు రిషి సునక్ కు దక్కనుంది.ఇలా ఎటు చూసినా రిషి బ్రిటన్ ప్రధానిగా త్వరలోనే భాద్యతలు స్వీకరించడానికి పెద్ద సమయం పట్టేలా లేదు.24 గంటల వ్యవధిలో ఈ విషయంపై ఓ క్లారిటీ రానున్నదని తెలుస్తోంది.రిషి బ్రిటన్ ప్రధానిగా భాద్యతలు తీసుకునే క్షణం కోసం భారతీయులు ప్రతీ ఒక్కరూ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.







