యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు.మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ వినూత్నంగా ప్రచారం చేపట్టారు.తమ పార్టీ గుర్తు అయిన కమలం పూలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో ఇళ్లల్లోని సభ్యులకు కమలం పూలను అందించారు.







