పెళ్లి జరిగిన వారికి ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..

ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు సంతాన లేమి సమస్య తో బాధపడుతు ఉన్నారు.ఈ సమస్యలు ఎక్కువగా ఆడవారిలోనే ఉన్నాయని ఎక్కువమంది చెబుతూ ఉంటారు.

 If Married People Have These Habits, It Will Be Difficult To Have Children ,chil-TeluguStop.com

నిజానికి పిల్లలు పుట్టకపోవడానికి అసలు కారణం మగవారి అలవాట్లే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గించే ఈ చెడ్డ అలవాట్లు ఏవో తెలుసుకుందాం.

పొగ త్రాగే అలవాటు ఉన్న మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.పొగ త్రాగని వారితో పోలిస్తే పొగ తాగే వారిలో స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ సేవించడం చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఇదేదో మంచి అలవాటు అన్నట్లు అలవాటు చేసుకుంటున్నారు చాలామంది.ఇలా చేస్తే వారికి ఏదో గౌరవం, గుర్తింపు లభిస్తుంది అనుకుంటున్నారో ఏమో కానీ ఈ చెడు అలవాటుకి చాలామంది బానిసలు అవుతూ బతుకుతున్నారు.

ఈ ఆల్కహాల్ త్రాగడం వల్ల వీర్యకణాలు ఉత్పత్తి తగ్గిపోతుంది.దానివల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.ఒకవేళ ఇటువంటి వారికి పిల్లలు పుట్టిన వారు అనారోగ్యంతో బాధపడే అవకాశం కూడా ఉంది.

Telugu Alcohol, Childlessness, Tips, Married, Married Habits, Habit-Telugu Healt

ఒత్తిడి అనేది ప్రపంచంలో ఉన్న అన్ని రోగాల కంటే భయంకరమైనది.దీనివల్ల ఎన్నో మానసిక శరీరిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా ఈ ఒత్తిడి సంతాన ఉత్పత్తికి సంబంధించిన వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన హార్మోన్ల పై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

అధిక బరువు కూడా పురుషుల్లో సంతాన ఉత్పత్తిని తగ్గించే హార్మోన్లను విడుదల చేసే అవకాశం ఉంది.అంతే కాకుండా ఇలాంటి అధిక బరువు గుండెకు సంబంధించిన సమస్యలను అధికం చేస్తుంది.

నా అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రతి రోజు సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండడం వల్ల అధిక బరువును తగ్గించుకునే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube