సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో నరసింహ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే.కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
సౌందర్య ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.రమ్యకృష్ణకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్రలలో నరసింహ సినిమాలోని నీలాంబరి పాత్ర కూడా ఒకటి కావడం గమనార్హం.
అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ఉంటుంది.ఈ సీన్ కు సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే ఈ సినిమా దర్శకుడు కేఎస్ రవికుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు.మొదట నగ్మాను నీలాంబరి రోల్ కోసం ఎంపిక చేయాలని భావించామని ఆ తర్వాత మీనాను ఆ పాత్ర కోసం ఎంపిక చేయాలని అనుకున్నామని అయితే కొన్ని కారణాల వల్ల రమ్యకృష్ణను ఎంపిక చేశామని కేఎస్ రవికుమార్ అన్నారు.
రమ్యకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటి నుంచి తనకు తెలుసని కేఎస్ రవికుమార్ చెప్పుకొచ్చారు.రమ్యకృష్ణ సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ చేయాలని నేను చెప్పగానే రమ్యకృష్ణ ఆ సీన్ ను తాను చేయనని చెప్పారని కేఎస్ రవికుమార్ కామెంట్లు చేశారు.సౌందర్య పెద్ద హీరోయిన్ అని నాకు మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పారని సౌందర్య చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఆమెనే రమ్యకృష్ణ కాలిని ముఖంపై పెట్టుకున్నారని కేఎస్ రవికుమార్ వెల్లడించారు.రమ్యకృష్ణ ఆ సమయంలో ఏడ్చేశారని ఆయన కామెంట్లు చేశారు.
ఆ షాట్ రియల్ అని కేఎస్ రవికుమార్ అన్నారు.ఆ షాట్ లో రమ్యకృష్ణ, సౌందర్య నటించారని డూప్ లు లేరని కేఎస్ రవికుమార్ కామెంట్లు చేశారు.
దర్శకునిగా కేఎస్ రవికుమార్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.