ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.46
సూర్యాస్తమయం: సాయంత్రం 06.39
రాహుకాలం:ఉ.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.9.30ల10.30,సా.2.20ల4.00
దుర్ముహూర్తం: సా.5.02ల5.53
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ సొమ్మును తీసుకున్నవారు తిరిగి ఇస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
వృషభం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చెయ్యకూడదు.కొన్ని శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశముంటుంది.
అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.
మిథునం:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా తలదూర్చకండి.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి అవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.విద్యార్థులు చదువు పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించడం మంచిది.ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
కన్య:
తీరిక లేని సమయం గడుపుతున్న మీకు ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.త్వరలో ఒక శుభవార్త వింటారు.మీరు అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
సమయాన్ని వృధా చేయకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.
వృశ్చికం:
ఈ రోజు మీరు అనవసరమైన విషయాలకు గొడవ పడుతూ ఉంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాలి
మకరం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.అనవసరమైన ఖర్చులు బాగా చేస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.సమయం ను కాపాడుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయక పోతే మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచు కోకండి.సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మీనం:
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని విషయాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.సమయాన్ని కాలక్షేపం చేయకండి.