తలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడుతూ ఫలితం తమకు అనుకూలంగా ఉండే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎక్కడెక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాని పోటీ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, బిజెపి( BJP ) స్పీడ్ పెంచుతోంది.
ప్రజలను ఆకట్టుకునే విధంగా అనేక సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చేందుకు రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా బిజెపి తన మేనిఫెస్టోను తయారు చేసే పనిలో ఉంది.
ఈ మేరకు మేనిఫెస్టో కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో ప్రకటించిన హామీల కంటే భిన్నంగా మేనిఫెస్టోను విడుదల చేయాలని బిజెపి భావిస్తోంది.
రైతులు , మహిళలు, యువకులతో పాటు , ఎస్సీ, ఎస్టీ , బీసీ సామాజిక వర్గాలను కలుపుకు వెళ్లే విధంగా కొత్త మేనిఫెస్టోను రూపొందిస్తున్నారట.

మేనిఫెస్టో కమిటీ రూపొందించిన మేనిఫెస్టోను కేంద్రమంత్రి అమిత్ షాకు అందించనున్నారట.ఆయన ఆమోదం తర్వాత మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.ఈనెల 17న అమిత్ షా( Amit Shah ) తెలంగాణలో పర్యటించి ఉన్నారు నల్గొండ వరంగల్ గద్వాల రాజేందర్ నగర్ లలో భారీ బహిరంగ సభలు లో ఆయన పాల్గొనబోతున్నారు అప్పుడే ఈ మేనిఫెస్టోను విడుదల చేయాలని బిజెపి భావిస్తుంది.
ఇప్పటికే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది.ఈ హామీతో బీసీలంతా బిజెపి వైపు ఉంటారని ఆ పార్టీ అంచనా వేస్తోంది ఇది ఎలా ఉంటే బిజెపి మ్యానిఫెస్టో ఈ విధంగా ఉండబోతున్నట్లు సమాచారం.
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్( Ayushman Bharat ) కింద పది లక్షలు దాక ఉచిత వైద్యం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేద వ్యక్తికి ఇల్లు.వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 20,000 చెల్లింపు నిరుద్యోగులకు యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్రై ,తులను ఆదుకునేందుకు వరి మద్దతు ధర క్వింటాల్ కు 3100.

ప్రతి వ్యక్తికి జీవిత బీమా వర్తింపు, రైతులకు కాకుండా కవులు రైతులు ,ఆటో రిక్షా కార్మికులు, ఇతర పేదలకు ప్రమాద బీమా ఐదు లక్షల చెల్లింపు , వివాహిత మహిళలకు ఏడాదికి 12,000 భృతి, మహిళా సంఘాలు రైతులకు వడ్డీ లేని రుణాలు, వంట గ్యాస్ సిలిండర్ 500 కు అందించే చర్యలు, ఇంట్లో వృద్ధులైన భార్యాభర్తలు ఇద్దరికీ రెండు పెన్షన్లు , ఐఐటి ఎయిమ్స్ తరహాలో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల ఏర్పాటు, జర్నలిస్టులకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చర్యలు .