ఆప్ఘన్ లో అరాచక పాలన షురూ.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది?

ప్రజాస్వామ్య అప్ఘనిస్తాన్ లో మరోసారి అలజడి చెలరేగింది.అక్కడి సర్కారు లాలిబన్లకు లొంగిపోయింది.

 Present Situation In Afghanistan And Why This Is Happened, Afghanisthan, Joe Bid-TeluguStop.com

అంతేకాదు.అధికార బదిలీకి అష్రప్ సర్కారు ఓకే చెప్పింది.

ఈ పరిణామంతో తుపాకీ మూకలకు చేతుల్లోకి అప్ఘన్ సర్కారు చేరిపోయింది.ఆ దేశ రాజధాని కాబూల్ ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

అయితే ఇంతకీ అఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అప్ఘనిస్తాన్ లో మొదటి నుంచి రెండు ఐడియాలజీలున్న వర్గాలు ఉండేవి.

అందులో ఒకరు కమ్యూనిస్టులు కాగా.మరొకరు ఇస్లామిక్ వాదులు.

ఈ రెండు వర్గాల మధ్య నిత్యం అధికారం కోసం పెనుగులాట జరిగేది.అయితే కొంతకాలం తర్వాత కమ్యూనిస్టులు బలహీన పడటం మొదలుపెట్టారు.

దీంతో అక్కడి కమ్యూనిస్టు నాయకులకు యుఎస్ఎస్ఆర్ మద్దతు ఇచ్చింది.అప్పుడే యుఎస్ఎస్ఆర్ కు, అమెరికాకు మధ్య వైరం ఉండేది.

అందుకే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉన్న ముజాహిద్దీన్ గ్రూపుకు అమెరికా సపోర్టు ఇచ్చింది.దీంతో ముజాహిద్దీన్ గ్రూప్ బలపడింది.

కమ్యూనిస్టులు వారిని తట్టుకోలేక కనుమరుగయ్యారు.

అనంతరం అక్కడి ఇస్లామిక్ వాదులు అల్ ఖైదా, తాలిబన్లుగా ఏర్పడ్డారు.

అఫ్ఘన్ దుస్థితికి అమెరికా కారణం అని ఆల్ ఖైదా చీఫ్ లాడెన్ అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడులు చేశాడు.

Telugu Afghanistan, Al Khaida, America, Bin Laden, Kabul, George Bush, Joe Biden

అప్పుడు అమెరికాలో బుష్ సర్కారు ఉంది.తమపై దాడి చేసిన లాడెన్ తో పాటు ఆయన గ్రూపును నామరూపాలు లేకుండా చేయాలని అమెరికా భావించింది.అమెరికా తమ బలగాలను అఫ్ఘన్ కు పంపించింది.

అటు తాలిబన్లు కూడా అల్ ఖైదాకు మద్దతుగా ఉన్నారని తెలుసుకున్నా అమెరికా.వారిపైనా తమ దాడులు మొదలు పెట్టింది.2001లో పాకిస్తాన్ లో రహస్యంగా తలదాచుకున్న లాడెన్ ను అమెరికా బలగాలు చంపేశాయి.అంతకు ముందే చాలా మంది తాలిబన్లు పాక్ కు పారిపోయారు.అక్కడ బలం పెంచుకున్నారు.ఆ తర్వాత అప్ఘన్ కు తిరిగి వచ్చారు.2001 నుంచి అప్ఘన్ లోనే అమెరికా బలగాలున్నాయి.అయితే అక్కడ తమ బలగాలు ఉండటం వల్ల అనవసర ఖర్చు తప్ప ఒరిగేదేమీ లేదని అమెరికా తాజా అధ్యక్షుడు జో బైడెన్ భావించాడు.

Telugu Afghanistan, Al Khaida, America, Bin Laden, Kabul, George Bush, Joe Biden

ఈ నేపథ్యంలో తాలిబన్లతో అమెరికా సర్కారు చర్చలు జరిపింది.పలు ఒప్పందాలు చేసుకుంది.తాలిబ‌న్ల కాల్పుల విర‌మ‌ణ‌తో పాటు ఓ రాజకీయ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం, అఫ్ఘన్ భూభాగం నుంచి ఎలాంటి దాడులు అమెరికాపైకి జరగకూడదనే నిర్ణయానికి వచ్చారు.ఈ ఒప్పందం తర్వాత కొద్ది రోజులకే అమెరికా తమ బలగాలను వెనక్కి రప్పించుకుంది.

బ‌గ్రామ్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనికులను తీసుకెళ్లింది.అంతకు ముందు అమెరికా కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరిగేవి.

అమెరికా బలగాలు వెళ్లిన కాసేపటికే ఈ ప్రాంతాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు.అక్కడే ఉన్న అమెరికా ఆయుధాలను చేజిక్కించుకున్నాయి.

వెంటనే అక్కడి సర్కారును కూల్చడమే లక్ష్యంగా ముందుకు సాగారు.ప్రస్తుతం తాలిబన్ రాజ్యాన్ని స్థాపించారు.

మొత్తంగా నాలుగు కోట్ల జనాభా ఉన్న అప్ఘన్ లో ప్రస్తుతం తుపాకీ రాజ్యంగా మారింది.ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే.

తాలిబన్ల ప్రభావం బంగ్లాతో పాటు భారత్, పాకిస్తాన్ లోనూ కొనసాగే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube