ఏపీలో జరిగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే విజయం సాధిస్తామని, 175 స్థానాలను కైవసం చేసుకుంటామని వైఎస్ జగన్ ( CM Jagan )పదే పదే చెబుతూ వస్తున్నారు.ఆయన నిర్దేశించుకున్న టార్గెట్ పై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి.
ఆయన మాత్రం వైనాట్ 175 అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.అయితే జగన్ ఈస్థాయి కాన్ఫిడెంట్ వ్యక్తం చేయడానికి కారణం కూడా లేకపోలేదు.
దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చమని జగన్ చెబుతున్నారు.
దాంతో ప్రజలంతా వైసీపీకే వైసీపీకే అండగా ఉన్నారనేది వైసీపీ ధీమా.అయితే నిజంగానే ప్రజామద్దతు వైసీపీకి ఉందా అనే సమాధానం చెప్పలేని పరిస్థితి.సంక్షేమ పథకాల పేరుతో ఖాతల్లో నగదు జమ చేయడంతప్పా ఎలాంటి అభివృద్ది జరగలేదని జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది.
పైగా పథకాల అమలు కోసం కేటాయిస్తున్నా నిధులను పన్నుల రూపంలో జగన్ తిరిగి వసూలు చేస్తున్నారనే విమర్శ కూడా ప్రజల్లో ఉంది.అందుకే జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజామద్దతు లభించింది.
ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాల్సిఉంది.
ఈ నేపథ్యంలో అధికార వైసీపీ 175 నియోజిక వర్గాల్లో పర్యటనలు జరిపేందుకు బస్సు యాత్ర చేపట్టింది.అయితే ఊహించని రీతిలో ఈ యాత్రకు ప్రజా మద్దతు కరువైంది.ఈ నెల 26న సామాజిక సాధికార యాత్ర పేరుతో ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర ప్రారంభించారు వైసీపీ నేతలు.
కానీ ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రజలు మొగ్గు చూపకపోవడం వైసీపీ నేతలను డైలమాలో పడేసింది.యాత్ర ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్న.ఎలాంటి హడావిడి లేకపోవడం గమనార్హం.దీన్ని బట్టి వైసీపీ( YCP ) పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ వాదులు చెబుతున్నారు.
మరి ప్రజలను ఆకర్షించేదుకు ముందు రోజుల్లో స్వయంగా జగనే బరిలోకి దిగుతారా ? లేదా అనేది చూడాలి.