సంక్రాంతి పండుగ కానుకగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలలో మూడు సినిమాలు భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటే ఒక సినిమా మాత్రం కలెక్షన్ల విషయంలో నిరాశపరిచింది.గుంటూరు కారం,( Guntur Karam ) హనుమాన్,( Hanuman ) సైంధవ్,( Saindhav ) నా సామిరంగ( Naa Saami Ranga ) సినిమాలలో సైంధవ్ సినిమా కలెక్షన్లు 10 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నాయి.
మిగతా సినిమాలతో పోల్చి చూస్తే టాక్ ఆశాజనకంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.
అయితే మిగతా మూడు సినిమాలలో ఒక సినిమా బుకింగ్స్ కు, కలెక్షన్లకు పొంతన లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ సినిమా నిర్మాతలు ప్రకటిస్తున్న కలెక్షన్లకు బుక్ మై షో,( Book My Show ) ఇతర యాప్స్ లో జరుగుతున్న బుకింగ్స్ కు ఏ మాత్రం సంబంధం లేదు.ఫేక్ కలెక్షన్ల ( Fake Collections ) వల్ల ఆ సినిమా నిర్మాతలు సాధించేది ఏంటని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతి సినిమాల( Sankranti Movies ) బుకింగ్స్, కలెక్షన్స్ మధ్య ఏ మాత్రం పొంతన లేకపోవడం నిర్మాతలను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం.ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించడం కూడా సంక్రాంతి సినిమాలకు కలిసొస్తుందని చెప్పవచ్చు.సంక్రాంతి పండుగ ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదల కావడం వల్ల అన్ని సినిమాలకు నష్టం కలుగుతోంది.
సంక్రాంతి పండుగకు మూడు కంటే ఎక్కువ సినిమాలు విడుదలైతే థియేటర్లను కేటాయించడం కూడా కష్టమవుతోంది.సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి.ఫేక్ కలెక్షన్ల వల్ల ఫ్యాన్స్ మధ్య సైతం గొడవలు వస్తున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాలలో రెండు సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించి మంచి లాభాలను సొంతం చేసుకోవడం జరిగింది.మిగతా సినిమాలు మాత్రం నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.