కూల్ డ్రింక్ బాటిల్‌ ఎందుకు నిండుగా ఉండదో తెలుసా.. సైంటిఫిక్ రీజనే కారణం!

సాఫ్ట్ డ్రింక్స్ ప్రతి పార్టీలో తప్పకుండా కనిపిస్తాయి. కూల్ డ్రింక్స్ లేకుండా రెస్టారెంట్లు నడవవు.

 Do You Know Why A Cool Drink Bottle Is Not  Full  Scientific Reason Cool Drinks,-TeluguStop.com

అయితే దాదాపు చాలా కూల్ డ్రింక్స్‌ను నిండుగా నింపకుండా కాస్త తగ్గించి అందిస్తాయి కంపెనీలు.బాటిల్ నిండా డ్రింక్ నింపరనే విషయం మీరు ఇప్పటికే గమనించి ఉంటారు.

అయితే దీని వెనుక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది.ఆ సైంటిఫిక్ రీజన్ ప్రకారం, తక్కువగా డ్రింక్ నింపకపోతే బాటిల్ పగిలిపోయే ప్రమాదం ఉంది.

అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాఫ్ట్ డ్రింక్స్ అనేవి ఫ్లేవర్డ్ కార్బోనేటేడ్ వాటర్ (కార్బన్ డయాక్సైడ్ బబుల్స్) అని చెప్పవచ్చు.

అందుకే బాటిల్ లోపల ఒత్తిడి అనేది బయట ఒత్తిడి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.దాని వల్ల డ్రింక్ బాటిల్‌లో నుంచి బయటికి తన్నుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది.

అదే బాటిల్ పూర్తిగా నింపినట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్‌పై మరింత పెరుగుతుంది.ఈ ఒత్తిడి వివిధ రకాల ఉష్ణోగ్రతల్లో తారా స్థాయికి చేరుకుంటుంది.

అప్పుడు బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంది.అందుకే బాటిల్‌పై ఎలాంటి ప్రెజర్ పడకుండా బాటిల్‌లో కొంత ఖాళీ ఇస్తారు.

దీనివల్ల డ్రింక్ లోని ఒత్తిడి బాటిల్ ఖాళీ స్పేస్‌పై మాత్రమే పడుతుంది కానీ బాటిల్‌పై పడదు.

Telugu Cool Drinks, Scientific, Latest-Latest News - Telugu

ఇంకా వివరంగా తెలుసుకుంటే, సాధారణంగా చాలా కోల్డ్ ప్రదేశాల్లో బాటిల్స్‌ను ఫిల్ చేస్తారు.ఈ సమయంలో డ్రింక్ అనేది దాదాపు ఘనీభవించిన స్థాయిలో ఉంటుంది.కానీ దీనిని సరఫరా చేస్తున్నప్పుడు అది రూమ్ టెంపరేచర్ తో పాటు తీవ్రమైన ఎండకి కూడా గురవుతుంది.

అప్పుడు ఆ డ్రింక్ లో స్వల్ప మొత్తం గ్యాస్ లాగా మారుతుంది.ఈ గ్యాస్ బాటిల్ లోనే ఉండడానికి స్పేస్ ఇవ్వడం తప్పనిసరి.స్పేస్ ఇవ్వకపోతే ఈ గ్యాస్ బయటికి వెళ్లేందుకు బాటిన్‌ని కూడా పగలగొడుతుంది.అందుకే స్పేస్ ఇస్తారు.

స్పేస్ ఇవ్వడానికి మరొక కారణం కూడా ఉంది.అది ఏంటంటే, స్పేస్ వల్ల డ్రింక్ క్వాలిటీ, టేస్ట్ ఎప్పటికీ మారదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube