చిత్రం : నేను లోకల్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకత్వం : త్రినాథ రావు
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : దేవీశ్రీప్రసాద్
విడుదల తేది : ఫిబ్రవరి 3, 2017
నటీనటులు : నాని, కీర్తి సురేష్ , సచిన్ ఖడేకర్
నాని సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఒరకంగా చెప్పాలంటే, సెకండ్ లీగ్ హీరోల్లో నానిని నెం1 గా చెప్పుకోవచ్చు.
అలాంటి స్థాయికి చేరుకున్న నాని మార్కెట్ ని ఉపయోగించుకోవాలని దిల్ రాజు, త్రినాథ రావు దర్శకత్వంలో చేసిన సినిమాయే ఈ “నేను లోకల్”.మరి ఈ చిత్రం నాని ఫామ్ ని కంటిన్యూ చేస్తుందా లేక బ్రేక్ వేస్తుందా చూద్దాం.
కథలోకి వెళితే :
ఆటిట్యూడ్ ఈజ్ ఎవ్రిధింగ్.ఆ ట్యాగ్ లైన్ కి తగ్గట్టుగా అల్లరిచిల్లరగా తిరిగే పక్కా లోకల్ కుర్రాడు బాబు (నాని).
ఇలాంటి కుర్రాళ్ళు అందమైన అమ్మాయిని చూస్తే ఆగలేరు కాబట్టి చూడగానే కీర్తి (కీర్తి సురేష్) తో ప్రేమలో పడతాడు.తనకోసమే MBA చేస్తూ తనని పడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు.
మొత్తానికి అమ్మాయి సెట్ అయిపోతుంది.కాని కథలో ఓ చిన్న మలుపు.
నవీన్ చంద్ర కీర్తికి కొన్ని సంవత్సరాల క్రితమే ప్రపోజ్ చేసాడు.తన తండ్రి (సచిన్ ఖేడేకర్) ని ఇంప్రెస్ చేసి కీర్తిని వివాహమాడేందుకు లైఫ్ లో ఎదిగి వచ్చాడు.
ఇక్కడ మన హీరో ఏమో ఇంకా అల్లరి బ్యాచ్.
కీర్తికి పెళ్లి ఫిక్స్ అయిపోతుంది.
బాబు కీర్తిని పెళ్లి చేసుకోవాలంటే ఉన్న కొద్ది సమయంలో కీర్తి తండ్రిని ఒప్పించాలి.దానికోసం బాబు ఏం చేసాడో తెరమీదే చూడండి.
నటీనటుల పెర్ఫార్మెన్స్ :
నానికి మైసన్ మార్కులు వేయాడానికి ఎవరికీ మనసు ఒప్పదు.కథలో దమ్ము లేకపోయినా, సీన్ లో సారం లేకపోయినా, తనకు మాత్రమే సాధ్యపడే నేచురల్ టైమింగ్ తో సినిమాలని నెట్టుకొచ్చే నాని, మరోసారి అదే పని చేసాడు.
తన ఆటిట్యూడ్, తన టైమింగ్ .ఇవే సినిమాకి బలంగా మారాయి.కీర్తి సురేష్ చాలా యావరేజ్.లుక్స్ పరంగా కూడా మెప్పించలేకపోయింది.పోసాని క్యారక్టర్ ఫర్వాలేదు.నవీన్ చంద్ర బాగా చేసాడు.
సచిన్ ఒకే.సింపుల్ గా చెప్పాలంటే, నాని ప్రేజెన్స్ లో మిగితా పాత్రధారులంతా తేలిపోతారు.
టెక్నికల్ టీం :
దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే సక్సెస్ ని సాధించింది.నెక్స్ట్ ఏంటి అనే పాట వీడియోపరంగా యువతకి మంఛి కిక్ ఇస్తుంది.
నేపథ్య సంగీతం యావరేజ్.మిగితా పాటలు లైట్.
ఎడిటింగ్ సెకండాఫ్ లో ఇంకా చాలా బాగా చేయాల్సింది.సినిమాటోగ్రాఫీ పర్వాలేదు అంతే.
నిర్మాణ విలువలు ఎలాగో బాగుంటాయి నిర్మాత దిల్ రాజు కాబట్టి.
విశ్లేషణ :
ఇది చాలా రొటీన్ సినిమా.అల్లరిచిల్లరగా తిరిగే పాత్రలు ఇంతవరకు చాలామంది చేసినా, ఆ లోకల్ ఫ్లేవర్ లో నాని ఆకట్టుకున్నాడు.వినోదం బాగా పేలింది ఫస్టాఫ్ లో.రెండుమూడు సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.కథ చాలా తక్కువ.
సన్నివేశాలు వస్తుంటాయి, పోతుంటాయి .బోర్ కొట్టకుండా టైంపాస్ మాత్రం అవుతుంది.ఓ ట్విస్ట్ తో ఫస్టాఫ్ అయిపోయాక సినిమా గతి తప్పుతుంది.చెప్పాల్సిందే, సెకండాఫ్ బాగా లాగేశారు.
ఫస్టాఫ్ ఊపులో బ్లాక్బస్టర్ ఖాయం అని అనుకుంటే, సెకండాఫ్ మొదలయ్యక సినిమా సూపర్ హిట్ లేదా హిట్ అయితే చాలు అనే అభిప్రాయానికి వచ్చేస్తాం.డైలాగులు బాగున్నాయి.
కాని మాటల మీద పెట్టిన శ్రద్ధ కథ మీద అస్సలు పెట్టలేదు.దిల్ రాజు నిర్మాతగా నాని సినిమా చేసాడు కదా అని కొత్తదనం మాత్రం ఆశించవద్దు.
కాసేపు నాని కామెడికి బాగా నవ్వుకుందాం అనే వారికి ఈ సినిమా ఓ టైంపాస్.
ప్లస్ పాయింట్స్ :
* నాని* కామెడి * యూత్ ని అలరించే అంశాలు* మాటలు
మైనస్ పాయింట్స్ :
* రొటీన్ కథ* సెకండాఫ్ * నెక్స్ట్ ఎంటి మినహా పాటలు
చివరగా :
నాని కోసం … నాని కోసమే