'సైరా'లో అనుష్క ఉంది కాని జాన్సీ అయితే కాదు, మరేంటో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ పూర్తి అయ్యింది.అక్టోబర్‌లో విడుదల కాబోతుంది.

 Anushka In Sye Raa Narasimha Reddy But Not A Johnsy Character Nayana Tara-TeluguStop.com

ఈ సమయంలోనే సినిమాలో అనుష్క పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అసలు అనుష్క ఈ చిత్రంలో ఉందా లేదా అంటూ పలు రకాల వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చాయి.

ఎక్కువగా ఈ చిత్రంలో జాన్సీ లక్ష్మీబాయి పాత్రను పోషించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అనుష్క జాన్సీ పాత్రలో కనిపిస్తే సినిమా స్థాయి అమాంతం పెరుగనుందని భావించారు.

'సైరా'లో అనుష్క ఉంది కాని జాన్

తాజాగా సైరాలో అనుష్క పాత్రపై ఫుల్‌ క్లారిటీ వచ్చింది.ఈ చిత్రంలో అనుష్క ఉండటం కన్ఫర్మ్‌.అయితే జాన్సీ లక్ష్మిబాయి పాత్రలో కాదు.ఆమె ఒక సాదారణ మహిళ పాత్రలో కనిపించబోతుంది.ఆమె ద్వారా చిత్ర కథ ప్రేక్షకులకు తెలియనుందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.స్టోరీ టెల్లర్‌గా ఈ చిత్రంలో అనుష్క కనిపించబోతుంది.

ఒక మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్‌గా కనిపించి ఉయ్యాలవాడ చరిత్రను చెప్పబోతుందట.

'సైరా'లో అనుష్క ఉంది కాని జాన్

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో గత రెండేళ్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్‌ పూర్తి చేసుకుంది.దాంతో ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదలకు మార్గం సుగమం అయ్యింది.గాంధీ జయంతి సందర్బంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు అంచనాలున్నాయి.

అమితాబచ్చన్‌ తో పాటు పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.అందుకే ఈ చిత్రం మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube