టాలీవుడ్‌లో ఒక సాదారణ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీహరి తక్కువ సమయంలోనే రియల్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అన్ని పాత్రలను పోషించిన రియల్ స్టార్ శ్రీహరి మొదటి నుండి కూడా తన ఇద్దరు కొడుకుల్లో ఒకడిని దర్శకుడిగా మరొకరిని హీరోగా చూడాలని ఆశ పడ్డాడు.
ఆయన ఆశ మేరకు చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయం అయ్యాడు.రాజ్‌దూత్ చిత్రంతో తాజాగా మేఘాంశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
‘రాజ్‌దూత్’ కోసం పలువురు సెలబ్రెటీలు తమ వంతు అన్నట్లుగా చేయి వేశారు.కాని ఎంత చేసినా కూడా ఆ సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో ప్రేక్షకుల తిరష్కరణకు గురయ్యింది.ఎంతో మంది సెలబ్రెటీలు రాజ్‌దూత్ గురించి మాట్లాడారు.శ్రీహరిపై ఉన్న అభిమానం, అనుబంధంతో మేఘాంశ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఎంత చేసినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు దాన్ని సరైన రీతిలో వాడుకోవడంలో విఫలం అయ్యారు.దాంతో సినిమాను అసలు జనాలు పట్టించుకోలేదు.
రాజ్‌దూత్ సినిమాకు రివ్యూలు రాసేందుకు కూడా రివ్యూవర్స్ ఆసక్తి చూపలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రివ్యూలు రాకపోవడంతో పాటు ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లడం చాలా తక్కువ అయ్యింది.మొదటి రోజే సినిమా పరిస్థితి క్లీయర్‌గా తేలిపోయింది.సినిమాకు పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా వచ్చే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది.ఇది రియల్ స్టార్ శ్రీహరికే అవమానంగా భావించాలి.మొదటి సినిమాతో మంచి ఎంట్రీ దక్కుతుందని భావించిన మేఘాంశ్‌కు ఇది ఘోర పరాభవంగా టాక్ వినిపిస్తుంది.