పాకిస్తాన్ మూలాలతో అమెరికాలో పుట్టి, ఇండియాలో సెటిల్ అయిపోయింది నర్గిస్ ఫక్రి.తొలిచిత్రమే రణబీర్ కపూర్ లాంటి స్టార్ సరసన దొరికి, ఆ సినిమా హిట్ అయినా, నర్గీస్ కెరీర్ ఆశించిన ఎత్తులను చూడలేదు.
కారణం, చూడ్డానికి అందంగా ఉన్నా, అమ్మడి నటనే ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.అందుకే పూర్తిగా గ్లామర్ డాల్ అనే ఇమేజ్ వచ్చి, అన్ని గ్లామరస్ పాత్రలే దొరుకుతున్నాయి.
ఎంత గ్లామరస్ అంటే, నర్గిస్ సినిమాలో ఉంది అంటే చాలు, బికిని సన్నివేశంతో పాటు ముద్దు సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు.
కాని నర్గిస్ కి మాత్రం చిట్టిపొట్టి బట్టలు వేసుకోవాలంటే సిగ్గంట.శరీరాన్ని చూపెట్టడం తనకి ఇష్టం లేదని అంటోంది నర్గిస్.” ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నందుకు సంతోషమే.కాని నన్ను కురచ దుస్తులే వేసుకోమని అడుగుతారు, నాకు సిగ్గు ఎక్కువ, శరీరాన్ని చూపించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు కాని నా ఇమేజ్ అలాంటిది, ఏం చేద్దాం.బాలివుడ్ శరీరానికి ఎక్కువ ప్రధాన్యతనిచ్చే ఇండస్ట్రీ.
నేను అలాంటి నృత్యాలు వేయడమే జనాలకి కావాలి” అంటూ వాపోయింది నర్గిస్.
చిన్నబట్టలు వేయడం ఇష్టం లేదని స్టెటుమెంట్ ఇచ్చింది కాని, సినిమాల్లో అయితే సన్నివేశం కోసం తప్పదు, మరి నిజం జీవితంలో ఈ అమ్మడు బికినీల మీద ఎందుకు తిరుగుతుందో! ఏంటో ఈ హీరోయిన్లు .ఓ పట్టాన అర్థం కారు.







