దగ్గు( cough ).మనం అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.
అలర్జీలు, అంటువ్యాధులు, పర్యావరణ కాలుష్య కారకాలు దగ్గుకు దారితీస్తాయి.దగ్గు అనేది చిన్న సమస్యగానే అనిపించినా తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.
ఈ క్రమంలోనే దగ్గును తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే దగ్గుకు జామ ఆకులు విరుగుడు గా పనిచేస్తాయి.
దగ్గును తగ్గించే సత్తా జామ ఆకులకు ఉంది.
జామ ఆకులలో వివిధ బయో యాక్టివ్ సమ్మేళనాలు( Bioactive compound ) ఉన్నాయి.
అలాగే యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఫినోలిక్ సమ్మేళనాలను కలిగి ఉండే జామ ఆకులు( Guava leaves ) పల్మనరీ ట్రాక్ట్‌ల నుండి శ్లేష్మాన్ని తొలగిస్తాయి.దగ్గు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తాయి.
అయితే జామ ఆకులను ఎలా తీసుకుంటే దగ్గు తగ్గుతుంది అన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే నాలుగు కడిగిన జామ ఆకులను ముక్కలుగా కట్ చేసి వాటర్ లో వేయాలి.ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించిన తర్వాత వాటర్ ను ఫిల్టర్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ) కలిపితే జామ ఆకుల టీ సిద్ధం అవుతుంది.
రోజుకు ఒకసారి ఈ టీ ను తీసుకుంటే ఎలాంటి దగ్గు అయినా సరే పరార్ అవుతుంది.అలాగే జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి తగ్గుతాయి.

అంతేకాదండోయ్.జామ ఆకుల టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా జామ ఆకుల టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ జామ ఆకుల టీను మీరు మితంగా తీసుకోవాలి.
అధికంగా తీసుకుంటే అది మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.దురద, వికారం, వాపు, అతిసారం వంటి సమస్యలను కలిగిస్తుంది.