మీ పల్చటి ఐబ్రోస్ ను ఒత్తుగా మార్చుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఉల్లితో ఇలా చేయండి!

మగువల అందాన్ని డిసైడ్ చేయడంలో ఐబ్రోస్ ( Eyebrows )కీలక పాత్రను పోషిస్తాయి.

ఒత్తయిన ఐబ్రోస్ ముఖాన్ని మరింత అట్రాక్టివ్ గా చూపిస్తాయి.అందుకే దాదాపు అందరూ ఒత్తైన ఐబ్రోస్ ను కోరుకుంటూ ఉంటారు.

కానీ అందరికీ ఐబ్రోస్ ఒత్తుగా ఉండకపోవచ్చు.మీరు కూడా పల్చటి ఐబ్రోస్ తో బాధపడుతున్నారా.

? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మీ పల్చటి ఐబ్రోస్ ను కొద్ది రోజుల్లోనే ఒత్తుగా అందంగా మార్చుకోవచ్చు.

అందుకోసం ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ( Onion ) తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో అర కప్పు ఆవ నూనె వేసుకోవాలి.

అలాగే ఉల్లిపాయ తురుము వేసి చిన్న మంటపై దాదాపు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ లో హాఫ్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఈ ఆయిల్ ( Vitamin E Oil )వేసుకుని బాగా మిక్స్ చేయాలి.

"""/" / ఇప్పుడు ఈ ఆయిల్ ను ఒక బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను ఐ బ్రోస్ కు అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.

రోజుకో రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే మీ ఐబ్రోస్ ఎంత పల్చగా ఉన్నా కూడా ఒత్తుగా మారతాయి.

ఐబ్రోస్ గ్రోత్ ను పెంచడానికి ఈ ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది. """/" / అలాగే ఈ ఆయిల్ ను మీరు మీ జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు.

ఉల్లి, ఆలివ్ ఆయిల్ మరియు విటమిన్ ఈ ఆయిల్ లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలే సమస్యను అరికడతాయి.మరియు కురులు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. చంద్రబాబే స్వయంగా వెళ్లి