ఎంజీఆర్ చేసిన పనికి శివాజీ గణేశన్ మనస్తాపం.. అందుకే కాంగ్రెస్‌లో చేరిక..

తమిళ దిగ్గజ నటులు శివాజీ గణేశన్, ఎంజీ రామచంద్రన్ ఇద్దరూ మంచి స్నేహితులు.నాటకాల నుంచి వచ్చి వెండితెరపై నటులుగా రాణించారు.

 Shivaji Ganesan Unhappy With Mgr So That Joined Congress Party,shivaji Ganesan ,-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రజల అశేషమైన ఆదరణ పొందారు.అయితే, వీరిద్దరు కూడా ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు.

ఇకపోతే నాటకాల సమయంలో శివాజీ గణేశన్, ఎంజీఆర్ ఇద్దరు ఒకరినొకరు పొగుడుకోవడంతో పాటు ఎవరు ఎలా నటిస్తున్నారనేది చర్చించుకునేవారు.అయితే, ఆ తర్వాత కాలంలో మాత్రం వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది.

గొప్ప నటులుగా ఎంజీఆర్, శివాజీ గణేశన్ రాణించారు.ఈ క్రమంలోనే ఎంజీఆర్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు.ఈ క్రమంలోనే ఒకసారి జరిగిన సభలో కరుణానిధి, ఎంజీఆర్, శివాజీ గణేశన్ ముగ్గురూ ఉన్నారు.ఈ సందర్భంగా శివాజీ గణేశన్ మాట్లాడుతూ ఎంజీఆర్ తనను రమ్మని పిలిస్తే సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వస్తానని పేర్కొన్నాడు.

ఈ విషయం చాలా ఆవేశంగా చెప్పాడు.అనంతరం కరుణానిధి మాట్లాడుతూ ఎంజీఆర్ కోసం ఏదైనా చేయాడానికి తాను రెడీ అని తెలిపాడు.

ఆ తర్వాత ఎంజీఆర్ మాట్లాడుతూ కరుణానిధిని పొగిడారు కానీ శివాజీ గణేశన్ గురించి ఒక్క వాక్యం కూడా మాట్లాడలేదు.దాంతో ఆ విషయమై శివాజీ గణేశన్ మనస్తాపం చెందారట.

ఈ ఒక్క విషయమై కాదు ఇంకోసారి శివాజీ గణేశన్ ఎంజీఆర్ విషయంలో నొచ్చుకున్నారట.తమిళనాట వరదలు వచ్చిన సమయంలో నటీనటులందరూ సాయం చేశారు.

చందాలు సేకరించి మరీ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయలకు డబ్బులిచ్చారు.ఈ క్రమంలో శివాజీ గణేశన్ పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చారు.

అనంతరం డబ్బులిచ్చిన నటీనటులను ఎంజీఆర్ సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు.

Telugu Congress, Kamaraju Nadar, Karuna Nidhi, Kollywood, Mg Ramachandran, Shiva

అయితే, అందులో శివాజీగణేశన్ పేరు లేదట.ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడిపోయి శివాజీ గణేశన్ రోజంతాం ఒకే గదిలో ఉండిపోయారట.ఆ బాధలో స్నేహితుడిని కలిసేందుకు తిరుపతి వెళ్లాడు శివాజీ గణేశన్.

అది చూసి ఎవరో కొందరు డీఎంకేలో చేరబోయే శివాజీ గణేశన్ టెంపుల్స్‌కు వెళ్తున్నాడని పోస్టర్స్ వేశారు.అది చూసి బాధపడ్డ శివాజీ గణేశన్ కామరాజు నాడర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

అయితే, ఎంజీఆర్ మాదిరిగా శివాజీ గణేశన్ రాజకీయాల్లో రాణించలేకపోయారు.ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు తప్ప రాజకీయ వ్యూహ చతురతను ప్రదర్శించలేకపోయారు శివాజీ గణేశన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube