బీఆర్ఎస్( BRS ) పార్టీతో పొత్తు ఆశించి భంగపడిన వామపక్ష పార్టీల నేతలు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. కెసిఆర్ ( KCR )తమను నమ్మించి మోసం చేశారని, మునుగోడు ఉప ఎన్నికల్లో తమ ద్వారా లబ్ధి పొంది , ఇప్పుడు పక్కన పెట్టేసారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఒక్కటే ఏకైక ఆప్షన్ గా వామపక్ష పార్టీలకు కనిపిస్తోంది.జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎంతో పాటు , కాంగ్రెస్ కూడా ఉండడంతో తెలంగాణలోనూ పొత్తులకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నాయి.
ఇప్పటికి ఈ పొత్తుల వ్యవహారంపై చర్చలు జరుగుతున్నాయి.అయితే మెజార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం వామపక్ష పార్టీలతో కలిసి వెళ్లడం అంత మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే పార్టీ నేతలు మాత్రం పొత్తులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సీట్ల వ్యవహారం దగ్గరే చిక్కు వచ్చి పడింది.
![Telugu Congress, Telangana-Politics Telugu Congress, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Will-the-Congress-alliance-with-the-Red-parties-Lolli-at-the-seatsc.jpg)
రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రభావం బాగా తగ్గిపోయిందని , 10 ,15 చోట్ల కొంతమేర ఓటు బ్యాంకు ఉందని నాలుగైదు చోట్ల మాత్రం గెలుపోవటములను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు .కాంగ్రెస్ తో పొత్తుకు అంగీకారం కుదిరితే తమకు పట్టు ఉన్నా చోట అసెంబ్లీ స్థానాలను( Assembly locations ) తమకు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేసేందుకు సిపిఐ ,సిపిఎం నేతలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు.పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత సీట్లపై ఏకాభిప్రాయం కూడా వచ్చినట్లు సమాచారం.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు, భద్రాచలం, మధిర , ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడ తో పాటు, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నం స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో సిపిఎం ఉంది.
![Telugu Congress, Telangana-Politics Telugu Congress, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/Will-the-Congress-alliance-with-the-Red-parties-Lolli-at-the-seatsb.jpg)
అయితే ఈ ఆరు స్థానాల్లోనూ కాంగ్రెస్ ( Congress )బలంగా ఉండడంతో వీటిలో ఏ ఒక్క స్థానాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ ఇష్టపడడం లేదు.మధిర ,భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా , పాలేరు గతంలో కాంగ్రెస్ గెలిచింది.రంగారెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, పొందూరు రఘువీర్ రెడ్డి వంటి నేతలు ఉన్నారు .నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పోటీ చేసే ఆలోచనలు ఉన్నారు.దీంతో సిపిఎం అడిగే ఆరు స్థానాల విషయంలో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతోంది.
ఇక సిపిఐ విషయానికొస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా, నల్గొండ జిల్లాలోని మునుగోడు, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.ఈ రెండు వామపక్ష పార్టీలకు కోరుతున్న నియోజకవర్గల్లో కాంగ్రెస్ కూ బలం ఉండడంతో ఈ పొత్తుల వ్యవహారం డైలమాలో పడింది.