చామంతి పూలు.చూడటానికి ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
చామంతి పూలు ఎక్కువగా ఈ శీతాకాలంలోనే పూస్తుంటాయి.ముద్దు ముద్దుగా ఉండే చామంతి పూలను దాదాపు అందరూ అలంకరణకే ఉపయోగిస్తుంటారు.
అయితే వాస్తవానికి చామంతి పూలు అలంకరణకే కాదు.ఆరోగ్యం పరంగా, సౌందర్య పరంగా కూడా అద్భుతంగా ఉపయోగపడతాయి.
మరి ఇవి ఎలా ఉపయోగపడతాయి.ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
చామంతి పూలతో టీ తయారు చేసుకుని ప్రతి రోజు ఒక కప్పు సేవిస్తే.అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది.
అలాగే మధుమేహం వ్యాధి గ్రస్తులు ఏవేవో టీలు కాకుండా చామంతి టీ తాగితే.రక్తంలోని చక్కెర స్థాయిలో తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చామంతి టీ సేవించడం వల్ల నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతుంది.
ఇక నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సాయంత్రం వేళకు బాగా అలసిపోయి తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు.
అయితే అలాంటి వారికి చామంతి పూలు గ్రేట్‌గా సహాయపడతాయి.కొన్ని చామంతి పూలను మరియు ఆకులను నేతిలో లైట్‌గా వేయించి.కాసేపు చల్లారనివ్వాలి.అనంతరం వాటిని నుదిటపై పెట్టి కడితే.
తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఈ వింటర్ సీజన్‌లో చాలా మందిని దురదలు, ఎలర్జీలు వేధిస్తుంటారు.
అయితే అలాంటి వారు చామంతి ఆకులను, పువ్వులను మెత్తగా నూరి.దురదులు, ఎలర్జీలు ఉన్న ప్రాంతంలో పూయాలి.
ఇలా చేయడం వల్ల చామంతిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.త్వరగా ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇక చామంతి టీని ముఖానికి రాయడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు పోయి.చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.