జాతిరత్నాలు 2 ఉంటుంది కానీ.. అనుదీప్ ట్విస్ట్..!

అంతకుముందు పిట్టగోడ సినిమా తీసి పెద్దగా ఆకట్టుకోలేని డైరక్టర్ అనుదీప్ తన సెకండ్ మూవీ జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాడు.

 Anudeep About Jathiratnalu 2 Movie , Anudeep , Director Anudeep Kv, Jathiratnalu 2, Naveen Polishetty,tollywood-TeluguStop.com

అతను తన నెక్స్ట్ సినిమాగా శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్నాడు.ప్రిన్స్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇక ఈ సినిమాతో పాటుగా అనుదీప్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది.

 Anudeep About Jathiratnalu 2 Movie , Anudeep , Director Anudeep Kv, Jathiratnalu 2, Naveen Polishetty,Tollywood-జాతిరత్నాలు 2 ఉంటుంది కానీ.. అనుదీప్ ట్విస్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూర్ణోదయ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాతిరత్నాలు 2 గురించి హింట్ ఇచ్చాడు అనుదీప్.జాతిరత్నాలు 2 ఉంటుంది కానీ దానికి మరో 3, 4 ఏళ్లు పడుతుందని అన్నాడు.

పార్ట్ 2కి కథ ఇంకా రెడీ అవలేదని.ఆ కథ టీం అందరికి నచ్చాలని అప్పుడే అది సెట్స్ మీదకు వెళ్తుందని.

కాకపోతే జాతిరత్నాలు 2 తప్పనిసరిగా ఉంటుందని మరోసారి చెప్పాడు అనుదీప్.ప్రిన్స్ సినిమా కూడా హిట్ అయితే అనుదీప్ స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరే అవకాశం ఉంటుంది.

తన మార్క్ కామెడీ సినిమాలతో తనకంటూ ఒక మార్క్ వేసుకోవాలని చూస్తున్నాడు అనుదీప్.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube