లిప్స్ పింక్‌గా, మృదువుగా, ఆకర్షణీయంగా ఉంటే అందం మరింత రెట్టింపు అవుతుంది.కానీ, కొందరు ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.
పెదాలు మాత్రం డార్క్‌గా ఉంటాయి.దాంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది.
లిప్స్ డార్క్‌గా మారడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, తక్కువ క్వాలిటీ లిప్ స్టిక్స్ వాడటం, ఒంట్లో వేడి ఇలా రకరకాల కారణాల వల్ల లిప్స్ డార్క్‌గా మారతాయి.
అయితే కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే అందమైన లిప్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యంగా కీరదోస డార్క్ లిప్స్‌ను నివారించి.
రోజీ లిప్స్‌ను అందించడంతో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది మరి కీరదోస ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కీరదోస ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఆ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఐస్ అయిన తర్వాత వాటిని తీసుకుని పెదాలపై రుద్దు కోవాలి.
ఇలా తరచూ చేస్తే.క్రమంగా లిప్స్ పింక్‌గా మారతాయి.
అలాగే కీరదోస ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి అందులో షుగర్ వేసి కలపాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని లిప్స్‌కు మెల్ల మెల్లగా స్క్రబ్ చేసుకోవాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్క్రబ్ చేసిన అనంతరం కోల్డ్ వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే రోలీ లిప్స్‌ను పొందొచ్చు.

ఇక కీరదోస ముక్కల పేస్ట్‌లో కొద్దిగా తేనె మరియు నిమ్మ రసం కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు పూతలా వేసి.పావు గంట లేదా ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో పెదాలను వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల.డార్క్ నెస్ పోయి లిప్స్ పింక్‌గా మారతాయి.