జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ లో( Mahadevpur ) విజిలెన్స్ దాడులు( Vigilance Raids ) కొనసాగుతున్నాయి.ఈ మేరకు ఇరిగేషన్ కార్యాలయంలో మూడో రోజు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సోదాలలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌజ్ రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.

అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో( Kaleshwaram Project ) భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.







