టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత (Samantha) ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వివిధ దేశాలలో పర్యటిస్తూ తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.అయితే ఈమె మయూసైటిసిస్( Myositis ) వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి సమంత చికిత్సలో భాగంగా పలు దేశాలకు వెళ్తూ చికిత్స తీసుకోవడమే కాకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడా మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతున్నారు.
గత రెండు రోజుల క్రితం క్రయోథెరపీ అనే చికిత్స తీసుకున్నటువంటి ఈమె తాజాగా ఆయుర్వేద వైద్యం( Ayurved ) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.తాజాగా ఈమె ఈ చికిత్స కోసం భూటాన్ (Bhutan) వెళ్ళింది.
ఆయుర్వేదంలో భాగంగా సమంత హాట్ స్టోన్ బాత్( Hotstone Bath ) అనే ఒక చికిత్సను తీసుకుంటుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.
అలాగే అక్కడ చేనేత పరిశ్రమలకు సంబంధించిన ఫోటోలతో పాటు ప్రకృతి అందాలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు.ఆరు నెలల పాటు విరామం ఇచ్చినటువంటి సమంతా తదుపరి తాను కమిట్ అయినటువంటి సినిమా షూటింగ్ అన్నీ కూడా పూర్తి చేశారు.ఈ విధంగా సమంత చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి( Khusi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత తదుపరి ఎలాంటి సినిమాలకు కమిట్ అవలేదు ఇక ఈ ఏడాది మొత్తం దూరంగా ఉంటారని, వచ్చే ఏడాది ఈమె కొత్త సినిమాలకు కమిట్ అవ్వబోతున్నారనీ తెలుస్తుంది.