హెల్తీ లైఫ్ ను లీడ్ చేయాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం, రోజూ వ్యాయామం, కంటినిండా నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉంటే సరిపోదు.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సైతం ఎప్పటికప్పుడు బయటకు పంపుతూ ఉండాలి.
లేదంటే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.ప్రధానంగా గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పలు చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి.
అందుకే బాడీని అంతర్గతంగా క్లీన్ చేసుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డీటాక్స్ డ్రింక్స్( Detox drinks ) అద్భుతంగా తోడ్పడతాయి.
డ్రింక్-1:
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం రసం, రెండు స్పూన్లు నిమ్మరసం మరియు చిటికెడు పింక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ డ్రింక్ ను మార్నింగ్ సమయంలో తీసుకోవడం శరీరంలో వ్యర్ధాలు తొలగిపోతాయి.
జీర్ణక్రియ( Digestion ) సాఫీగా సాగుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా కూడా దూరం అవుతాయి.
డ్రింక్-2:
ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం మరియు నాలుగు దంచిన పుదీనా ఆకులు( Spearmint ) వేసి బాగా కలపాలి.ఈ డ్రింక్ కూడా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది.అదే సమయంలో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్ ను అందిస్తోంది.బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది.
డ్రింక్-3:
వ్యర్థాలను తొలగించి బాడీని శుభ్రంగా మార్చడానికి కీరా కివి జ్యూస్ కూడా ఎంతగానో తోడ్పడుతుంది.దీనికోసం బ్లెండర్ లో పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసిన ఒక కివి పండు, నాలుగు నుంచి ఐదు కీర దోసకాయ స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, చిటికెడు పింక్ సాల్ట్( Pink salt ) వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.దాంతో మన డీటాక్స్ డ్రింక్ సిద్ధమవుతుంది.ఈ డ్రింక్ ను వారానికి ఒకసారి తీసుకున్న చాలు.మీ బాడీ క్లీన్‌గా, హెల్తీగా ఉంటుంది.